News


మొబైల్‌ రీసైకిల్‌ చేస్తున్నది 12 శాతమే

Friday 12th July 2019
news_main1562915901.png-27014

  •  హైదరాబాద్‌ వినియోగదార్లపై 91మొబైల్స్‌ సర్వే
  • ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను పట్టించుకోని కస్టమర్లు
  • ఇళ్లలో పేరుకుపోతున్న పాత మొబైల్‌ ఫోన్లు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న హైదరాబాద్‌ కస్టమర్లలో 12 శాతం మంది మాత్రమే స్వచ్చందంగా తమ డివైస్‌ను రీసైక్లింగ్‌కు ఇస్తున్నారు. కొత్త మోడల్‌ కొంటున్న సమయంలో 9 శాతం మంది పాత ఫోన్‌ను విక్రేతకు ఇస్తున్నారని గ్యాడ్జెట్‌ డిస్కవరీ సైట్‌ 91మొబైల్స్‌.కామ్‌ సర్వేలో తేలింది. ఈ-వేస్ట్‌ కంపెనీ సెరెబ్రా గ్రీన్‌, మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీతో కలిసి ఈ పోర్టల్‌ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా 15,000 పైచిలుకు స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్లు ఇందులో పాలుపంచుకున్నారు. దీని ప్రకారం... ఫోన్‌ రీసైక్లింగ్‌ వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాల గురించి 65 శాతం హైదరాబాద్‌ కస్టమర్లకు అవగాహన ఉంది. వీరిలో 20 శాతం మాత్రమే రీసైకిల్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రీసైక్లింగ్‌ ప్రక్రియలో పాత మొబైల్స్‌ నుంచి పనికి వచ్చే విడిభాగాలను, ప్లాస్టిక్‌ను వేరు చేసి, కావాల్సిన కంపెనీలకు సరఫరా చేస్తారు. అలాగే పనికిరాని వ్యర్థాలను పర్యావరణానికి హానికాని రీతిలో, భద్రమైన పద్ధతిలో నిర్వీర్యం చేస్తారు. 
ఇంట్లో పనికిరాని ఫోన్లు...
వినియోగదార్ల ఇళ్లలో పనికిరాని ఫోన్లు ఓ మూలన పేరుకుపోతున్నాయి. అయిదుకుపైగా పనికిరాని ఫోన్లు తమ వద్ద ఉన్నాయని 12 శాతం మంది సర్వే సందర్భంగా తెలిపారు. అవసరానికి పనికి వస్తుందనే ఉద్ధేశంతో కనీసం ఒక ఫోన్‌ (కండీషన్లో ఉన్న) అట్టిపెట్టుకుంటున్నట్టు 55 శాతం మంది వెల్లడించారు. పనికిరాని పాత ఫోన్ల రీసైక్లింగ్‌ విషయాన్ని పట్టించుకోవటం లేదని 16 శాతం మంది తేల్చిచెప్పారు. అమ్మకం ద్వారా ఆశించిన విలువ రాకపోవడం వల్లే పాత ఫోన్‌ను భద్రంగా దాచుకున్నట్టు 20.6 శాతం మంది అభిప్రాయపడ్డారు. 6.9 శాతం కస్టమర్లు రీసైకిల్‌కు వ్యతిరేకం. క్యాష్‌కు రీసైకిల్‌ చేసినవారు 58 శాతం మంది ఉన్నారు. డిస్కౌంట్‌ కూపన్లకు 17 శాతం, గిఫ్ట్‌ కార్డులకు 5.4 శాతం మంది తమ పాత ఫోన్లను ఎక్స్‌చేంజ్‌ ద్వారా రీసైకిల్‌ చేశారు. 
టాప్‌-5లో భారత్‌...
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి రోజురోజుకీ సమస్యగా మారుతున్నాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్లు ప్రధానమైనవి. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు జమవుతున్న దేశాల్లో భారత్‌ టాప్‌-5లో ఉంది. ఏటా 20 లక్షల టన్నుల ఈ-వేస్ట్‌ పోగవుతోంది. ఈ నేపథ్యంలో రీసైక్లింగ్‌ ఇక్కడ అత్యవసరమని 91మొబైల్స్‌.కామ్‌ కో-ఫౌండర్‌ నితిన్‌ మాథుర్‌ ఈ సందర్భంగా చెప్పారు. ‘రోజురోజుకూ కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. పనికిరాని స్మార్ట్‌ఫోన్లను పర్యావరణానికి హానికాని, భద్రమైన పద్ధతిలో ఏ విధంగా రీసైకిల్‌ చేయవచ్చో వినియోగదార్లకు వివరించాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది. ఈ-వేస్ట్‌ వల్ల ఉత్పన్నమయ్యే పర్యావరణ సమస్యల గురించి 65 శాతం మంది హైదరాబాద్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు తెలుసు. అయినప్పటికీ వారు తమ మొబైల్‌ ఫోన్లను రీసైకిల్‌ చేయాలని భావించడం లేదు. ఈ-వేస్ట్‌ వల్ల తలెత్తే సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నాం. అలాగే అవసరం లేని ఉత్పత్తులను ఎక్కడ రీసైకిల్‌, విక్రయించాలో తెలియజేస్తున్నాం’ అని వివరించారు. You may be interested

స్వల్ప నష్టాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 12th July 2019

స్తబ్ధుగా సాగుతున్న మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ స్వల్పంగా నష్టపోయింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల పతనం ఇందుకు కారణమైంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లుకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 30,789.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తదుపరి అరశాతం క్షీణించి 164 పాయింట్లు క్షీణించి 30548.30 స్థాయి వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం 12:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(30,716.55)తో పోలిస్తే ఇండెక్స్‌ 30632

హైదరాబాద్‌లో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రెండో సెంటర్‌

Friday 12th July 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: అనలిటిక్స్‌, డేటా సర్వీసుల రంగంలో ఉన్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ హైదరాబాద్‌లో కొత్త ‘ఓరియన్‌’ కార్యాలయాన్ని ప్రారంభించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రానికి రూ.70 కోట్లు ఖర్చు చేశామని కంపెనీ ఇండియా ఎండీ అభిషేక్‌ తోమర్‌ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 700 మంది సపోర్ట్‌ సిబ్బంది ఓరియన్‌లో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌కు హైదరాబాద్‌లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో

Most from this category