News


మొబైల్స్‌, విడిభాగాల తయారీకి బడ్జెట్లో రాయితీలు?

Saturday 25th January 2020
news_main1579937546.png-31200


 ప్రత్యేక కేటాయింపులు

మరో వారం రోజుల్లో (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టబోయే కేం‍ద్ర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం డిజిటల్‌ టెక్నాలజీకి పెద్ద పీట వేయనుంది. ప్రస్తుత ప్రపంచమంతా డిజిటల్‌ టెక్నాలజీతో పరుగులు పెడుతుండడంతో... ఈ రంగంలో పెట్టుబడులు పెడుతూ.. అమెరికా, చైనా, జపాన్‌ ,దక్షిణ కొరియా వంటి దేశాలు ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌, మొబైల్‌ తయారీకి కావాల్సిన విడిభాగాల  ఉత్పత్తి యూనిట్లను ప్రారంభించి, వివిధ దేశాలకు హ్యాండ్‌ సెట్స్‌ ఎగుమతి చేయడానికి  2020 బడ్జెట్‌లో అధిక మొత్తంలో నిధులు, రాయితీలు కల్పించనుంది. వీటి ద్వారా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాన్ని మరింత వృద్ధిలోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో తన నివాసంలోఒక సమావేశాన్ని నిర్వహించి మేక్‌ ఇన్‌ ఇండియాను మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో శామ్‌సంగ్‌, యాపిల్‌ ఇండియా, బాష్‌ లిమిటెడ్‌, లావా కంపెనీల అధికారులతో పాటు స్టార్టప్‌ ప్రముఖులు, ఐటీ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా కలిసి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ఉత్పత్తిలో భారత్‌ను అతి పెద్ద దేశంగా నిలపాలంటే ఏం చేయాలనే కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో నిపుణులు చేసిన సూచనలు, సలహాలకనుగుణంగానే రాబోయే బడ్జెట్‌లో ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల అభివృద్ధికి పెద్ద పీట వేయనున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా 198 దేశాలు ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ వినియోగిస్తున్నప్పటికీ వాటిలో  హ్యాండ్‌ సెట్స్‌, విడిభాగాలు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా, వియత్నాంలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ దేశాల సరసన ఇండియా చేరేలా కేం‍ద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే బడ్జెట్‌ కేటాయింపులు, రాయితీలు కల్పించనుంది. అంతేగాక మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ తయారీ యూనిట్లను నోయిడాలో ఏర్పాటు చేసి కొత్త హబ్‌గా తీర్చిదిద్దనున్నారు. You may be interested

మరోసారి 1600డాలర్ల వైపు పసిడి

Saturday 25th January 2020

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర తొందర్లో మరోసారి 1600డాలర్లస్థాయిని అందుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల అమెరికా-ఇరాన్‌ సంక్షోభ సమయంలో ఒక్క ఉదుటన 1600 డాలర్లపైకి ఎగిసి, అటుతర్వాత క్రమేపీ 1,550 డాలర్లస్థాయికి పసిడి దిగివచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల ఆందోళనతో గత రెండు రోజుల నుంచి పసిడి పెరుగుతూ వస్తోంది. ఇక వచ్చే వారంలో అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్యపరపతి సమావేశాలు, చైనాలో కరోనా

ఐటీఐ ఎఫ్‌పీఓ: తొలిరోజు 6శాతం సబ్‌స్ర్కిప్షన్‌

Saturday 25th January 2020

ప్రభుత్వ రంగ ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌(ఐటీఐ) ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ) బిడ్డింగ్‌ ప్రక్రియలో భాగంగా తొలిరోజు 6శాతం సబ్‌స్క్రైబ్‌ అ‍య్యింది. కంపెనీ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ శుక్రవారం(24న) మొదలైంది. ఆఫర్‌లో భాగంగా మొత్తం జారీ చేసిన 18.18 కోట్ల షేర్లకు గానూ శుక్రవారం ఇష్యూ ముగింపు సమయానికి 1.01 కోటి ఈక్విటీ షేర్లకు బిడ్‌ ధాఖలయ్యాయి. ఇందులో రిటైల్‌ వ్యక్తిగత ఇన్వెస్టర్ల కోసం కోసం కేటాయించిన మొత్తం 32

Most from this category