STOCKS

News


కాకినాడలో లలిత జ్యూయలర్స్‌ ప్రారంభం

Thursday 30th January 2020
Markets_main1580354657.png-31315

బంగారు, వజ్రాభరణాల విక్రయ సంస్థ లలిత జ్యూయలర్స్‌ 25వ బ్రాంచ్‌ బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి కురసాల కన్నబాబు, లలిత జ్యూయలర్స్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.కిరణ్‌కుమార్‌ కాకినాడ బాలాజీచెరువు సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్‌ను ప్రారంభించారు.  నాణ్యత, ధర విషయంలో రాజీలేని విధంగా బంగారు, వజ్రాభరణాల విక్రయాల్లో ఖ్యాతిపొందిన లలిత జ్యూయలర్స్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు కావడం ఈ ప్రాంత ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి కన్నబాబు అన్నారు. లలిత జ్యూయలర్స్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, భీమవరంతోపాటు తెలంగాణలోని హైదరాబాద్‌ సోమాజీగూడ, కూకట్‌పల్లిలో లలిత జ్యూయలరీ షోరూంలు ఉన్నాయన్నారు. అత్యాధునిక వసతులతో ఇక్కడ కూడా బ్రాంచ్‌ను ఏర్పాటు చేశామని, పారదర్శకతతో తమ షోరూంలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌, మేయర్‌ సుంకర పావని, పలువురు నగర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 



You may be interested

యాపిల్‌ లాభం 2,200 కోట్ల డాలర్లు

Thursday 30th January 2020

ఆదాయం 9,180 కోట్ల డాలర్లు  డిసెంబర్‌ క్వార్టర్లో రికార్డ్‌ లాభం, ఆదాయం న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ గత ఏడాది అక్టోబర్‌- డిసెంబర్‌ క్వార్టర్లో రికార్డ్‌ స్థాయి ఆదాయాన్ని, నికర లాభాన్ని ఆర్జించింది. గత  ఏడాది అక్టోబర్‌- డిసెంబర్‌ క్వార్టర్‌కు గాను 2,200 కోట్ల డాలర్ల (మన కరెన్సీలో రూ.1,56,200 కోట్లు) నికర లాభం సాధించామని యాపిల్‌ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ తెలియజేశారు. మొత్తం ఆదాయం 9 శాతం వృద్ధితో 9,180

నిఫ్టీ మద్దతు 12,099, నిరోధం 12,069

Thursday 30th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 9 పాయింట్లు డౌన్‌ ఆసియాలో జపాన్‌ మార్కెట్‌ పతనం మళ్లీ ఊపందుకున్న కరోనా భయాలు  నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 9 పాయింట్ల వెనకడుగుతో 12,112  వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,121 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే.

Most from this category