News


మైండ్‌ ట్రీ లాభం 41 శాతం డౌన్‌

Thursday 18th July 2019
news_main1563432897.png-27153

  • 12 శాతం పెరిగిన ఆదాయం 
  • అనిశ్చితిలోనూ నిలకడ ఫలితాలు సాధించాం 
  • మైండ్‌ట్రీ సీఈఓ రోస్టో రావణన్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: మద్య స్థాయి ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 41 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.158 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.93 కోట్లకు తగ్గిందని మైండ్‌ట్రీ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం 53 శాతం తగ్గిందని వివరించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమ వృద్ధిని మించి వృద్ధిని సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేసింది. ఈ కంపెనీని ఇటీవలనే ఎల్‌ అండ్‌ టీ బలవంతంగా టేకోవర్‌ చేసిన విషయం తెలిసిందే. 

గత క్యూ1లో రూ.1,640 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 12 శాతం వృద్ధితో రూ.1,834 కోట్లకు పెరిగాయని మైండ్‌ట్రీ తెలిపింది. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 43 శాతం తగ్గి 1.3 కోట్ల డాలర్లకు, ఆదాయం 9 శాతం లాభంతో 26 కోట్ల డాలర్లకు చేరాయని పేర్కొంది. డిజిటల్‌ వ్యాపారం రెండు రెట్ల వృద్ధిని సాధించిందని తెలిపింది.  మొత్తం తమ కంపెనీలో 20,935 మంది ఉద్యోగులు ఉన్నారని, అట్రీషన్‌ రేటు(ఉద్యోగుల వలస) 15.1 శాతంగా ఉందని వివరించింది. 

వివిధ అనిశ్చిత పరిస్థితుల్లోనూ నిలకడైన ఫలితాలను సాధించామని, ఇది తమ వినూత్నమైన బలానికి నిదర్శనమని  మైండ్‌ట్రీ సీఈఓ, ఎమ్‌డీ రోస్టో రావణన్‌ పేర్కొన్నారు. ఈ క్యూ1లో రికార్డ్‌ స్థాయి కాంట్రాక్టులను సాధించామని పేర్కొన్నారు. ఈ క్యూ1లో 32 కోట్ల డాలర్ల డీల్స్‌ సాధించామని తెలిపారు. 



You may be interested

ఎస్సెల్‌ మూచ్యువల్‌ ఫండ్‌ వైపు సచిన్ బన్సాల్ చూపు

Thursday 18th July 2019

ఫ్లిప్‌కార్ట్ మాజీ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ మ్యూచువల్ ఫండ్‌ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జీ గ్రూప్‌కు చెందిన ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్‌ను కొనుగోలు చేయడానికి బన్సాల్ ప్రయత్నిస్తున్నట్లు, జీ గ్రూప్‌కి, బన్సాల్‌కు మధ్య చర్చలు తుది స్థాయిలో ఉన్నట్టు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక దన్నుతో ఎస్సెల్‌ మూచ్యువల్‌ ఫండ్‌ను అభివృద్ధి చేయడానికి బన్సాల్‌ ప్రణాళికలు రచిస్తున్నారని, సచిన్ బన్సాల్ ప్రతినిధులకు, ఎస్సెల్ నిర్వహకులకు మధ్య ఇప్పటికే బహుళ

కోల్‌ ఇండియాను విడగొడితే మంచిదే...!

Thursday 18th July 2019

వాటి మధ్య పోటీ ఏర్పడుతుంది తద్వారా ఉత్పత్తి మెరుగుపడుతుంది నిధుల సమీకరణకూ సులభ మార్గం అధ్యయనం చేస్తున్న కేంద్ర సర్కారు న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా ప్రఖ్యాతిగాంచిన కోల్‌ ఇండియాను పలు కంపెనీలుగా వేరు చేసి లిస్ట్‌ చేయాలన్న ప్రతిపాదనను మోదీ సర్కారు పరిశీలిస్తోంది. తద్వారా మూడు లక్ష్యాలను నెరవేర్చుకునే ఆలోచనతో ఉంది. ఒకటి పోటీ పెంచడం, రెండు ఉత్పత్తి పెంచడం, మూడు నిధులు సమీకరించడం. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని పెట్టుబడులు,

Most from this category