STOCKS

News


మైండ్‌ ట్రీ లాభం 35 శాతం డౌన్‌

Thursday 17th October 2019
news_main1571284141.png-28935

  • 9 శాతం వృద్ధితో రూ.1,914 కోట్లకు ఆదాయం 

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ ట్రీ సెప్టెంబర్‌ 30తో ముగిసిన క్వార్టర్‌లో రూ.135 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఏడాది ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.206 కోట్లు)తో పోల్చితే 35 శాతం క్షీణించిందని మైండ్‌ట్రీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,755 కోట్ల నుంచి 9 శాతం ఎగసి రూ.1,914 కోట్లకు పెరిగిందని పేర్కొంది. డాలర్ల పరంగా చూస్తే,  నికర లాభం 34 శాతం తగ్గి 1.92 కోట్ల డాలర్లకు, ఆదాయం 10 శాతం పెరిగి 27 కోట్ల డాలర్లకు ఎగసిందని వివరించింది. ఎల్‌ అండ్‌ టీ కంపెనీ 60.06 శాతం వాటాను చేజిక్కించుకోవడం ద్వారా  ఈ ఏడాది జూలైలో మైండ్‌ట్రీ కంపెనీని టేకోవర్‌ చేసిన విషయం తెలిసిందే. You may be interested

వరల్డ్ స్టీల్ వైస్‌ చైర్మన్‌గా సజ్జన్‌ జిందాల్‌

Thursday 17th October 2019

న్యూఢిల్లీ: ప్రపంచ ఉక్కు సంఘం (వరల్డ్ స్టీల్ అసోసియేషన్) వైస్‌ చైర్మన్‌గా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ సజ్జన్‌ జిందాల్‌ ఎన్నికయ్యారు. ఈయన పదవీకాలం ఇక్కడ నుంచి ఏడాది పాటు కొనసాగుతుంది. ఇక మెక్సికోలోని మాంటెర్రీలో జరిగిన వరల్డ్ స్టీల్ జనరల్ అసెంబ్లీలో ఈయనతో పాటు టాటా స్టీల్ సీఈఓ, ఎండీ టీ.వీ నరేంద్రన్.. ఆర్సెలర్ మిట్టల్ చీఫ్ ఎల్.ఎన్ మిట్టల్ సభ్యులుగా నియమితులయ్యారు. 

స్థిరంగా ప్రారంభమైన మార్కెట్‌

Thursday 17th October 2019

రెండు రోజులుగా ర్యాలీ జరుపుతున్న భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 48 పాయింట్ల స్వల్పలాభంతో 38,647 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 11,666 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category