News


గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి

Tuesday 25th June 2019
news_main1561439689.png-26555

  • 30 లక్షల నకిలీ బిజినెస్‌ ప్రొఫైల్స్‌ తొలగింపు

న్యూఢిల్లీ: గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి  30 లక్షల నకిలీ బిజినెస్‌ ప్రొఫైల్స్‌ను గత ఏడాది గూగుల్‌ తొలగించింది. వీటిల్లో దాదాపు 90 శాతం బిజినెస్‌ ప్రొఫైల్స్‌ను, యూజర్లు చూడకముందే తొలగించామని గూగుల్‌ మ్యాప్స్‌ ప్రొడక్ట్‌ డైరెక్టర్‌ ఈథన్‌ రస్సెల్‌ ఒక బ్లాగ్‌స్పాట్‌లో తెలిపారు. ఒక వ్యాపార సంస్థ కాంటాక్ట్‌ వివరాలను, ఆ సం‍స్థకు చేరుకోవలసిన మార్గాల గురించి గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా యూజర్లు సమాచారం తెలుసుకోవడం తెలిసిందే. ఈ వివరాలన్నింటినీ ఉచితంగానే అందిస్తామని, అయితే కొందరు మోసగాళ్లు వ్యాపార సంస్థల నుంచి అక్రమంగా వసూళ్లు చేశారని రస్సెల్‌ వివరించారు. మరోవైపు నకిలీ సంస్థలను చూపించి, తమదే అసలైన సంస్థ అంటూ వినియోగదారులను మోసం చేయడానికి ప్రయత్నించేవాళ్లని పేర్కొన్నారు. వివిధ రకాల టెక్నిక్‌లను ఉపయోగించడం ద్వారా తమ విభాగాలు దుర్వినియోగం కాకుండా చూశామని వివరించారు. యూజర్ల ఫిర్యాదుతో రెండున్నర లక్షల నకిలీ బిజినెస్‌ ప్రొఫైల్స్‌ను తొలగించామని పేర్కొన్నారు. దుర్వినియోగం చేస్తున్నారన్న ఉద్దేశంతో లక్షన్నర మంది యూజర్ల అకౌంట్లను రద్దు చేశామని వివరించారు. గూగుల్‌ మ్యాప్స్‌లో 20 కోట్లకు పైగా ప్రదేశాలను జత చేశామని, ప్రతి నెలా ప్రజలను, వ్యాపారాలను 900 కోట్ల సార్లు అనుసంధానిస్తున్నామని పేర్కొన్నారు. 



You may be interested

నష్టాల్లో ఆసియా మార్కెట్లు

Tuesday 25th June 2019

జీ20 సమ్మిట్‌ ముందు ఎదురు చూసే దోరణి అమెరికా-చైనా సమావేశంపై ఇన్వెస్టర్ల దృష్ఠి  ఆసియా మార్కెట్లు మంగళవారం(జూన్‌ 25)ట్రేడింగ్‌లో నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ వారం చివరిలో జపాన్‌లో జరగనున్నా జీ20 సమ్మిట్‌లో అమెరికా- చైనా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. చైనా షాంఘై కాంపోసీట్‌ 1.6 శాతం, షెంజన్‌ 1.1 శాతం నష్టపోయాయి. అదేవిధంగా హాంకాంగ్‌ హంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌ 1.2 శాతం,

కొత్త కస్టమర్లను చేరుకోవడమే లక్ష్యం

Tuesday 25th June 2019

కొత్త కస్టమర్లను చేరుకోవడమే లక్ష్యం ఐపీవో దీర్ఘకాలిక విధానంలో భాగం: ఫ్లిప్‌కార్ట్‌ న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం తమ దృష్టి అంతా 20-30 కోట్ల మంది భారతీయులను కొత్తగా ఈ -కామర్స్‌ వైపు తీసుకురావటంపైనే ఉందని స్పష్టంచేసింది. ఐపీవోకు రావడం అన్నది తమ ఆకాంక్ష అని, కంపెనీ దీర్ఘకాల వ్యూహంలో ఇది భాగమే అయినప్పటికీ ప్రస్తుతమైతే దీనికి కాలపరిమితి లేదని పేర్కొంది. 2022 నాటికి అమెరికా ఈక్విటీ మార్కెట్లోకి ఫ్లిప్‌కార్ట్‌

Most from this category