News


మున్ముందు ఎన్‌పీఏలు మిలీనియల్స్‌వేనా?

Wednesday 13th November 2019
news_main1573614283.png-29540

  • ఈ విభాగంలో అత్యధికం అన్‌సెక్యూర్డ్‌ రుణాలే
  • ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ నివేదికలో వెల్లడి

ముంబై: మిలీనియల్స్‌ (1980- 2000మధ్య జన్మించినవారు) తీసుకుంటున్న రుణాలు బ్యాంకులకు భవిష్యత్తు మొండి బకాయిలుగా (ఎన్‌పీఏలు) మారనున్నాయా..? గత రెండు సంవత్సరాలుగా బ్యాంకులకు మిలీనియల్స్‌ రుణాలే పెద్ద వ్యాపారంగా ఉండడంతో ఈ ప్రశ్న తలెత్తుతోంది. మిలీనియల్స్‌లో అత్యధికులు అన్‌సెక్యూర్డ్‌ రుణాలనే తీసుకుంటుండడం బ్యాంకులకు ఆందోళన కలిగించేదేనని ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ పేర్కొంది. కొత్తగా రుణాలు తీసుకునే మిలీనియల్స్‌ సంఖ్య 58 శాతం పెరగ్గా, ఇతర విభాగంలో ఈ వృద్ధి 14 శాతంగానే ఉందని ఓ నివేదిక రూపంలో సిబిల్‌ తెలియజేసింది. కార్పొరేట్‌ రుణ విభాగంలో భారీ ఎన్‌పీఏల నేపథ్యంలో బ్యాంకులు రిటైల్‌ రుణాలపై ఎక్కువగా ఆధారపడడం తెలిసిందే. అన్‌ సెక్యూర్డ్‌ రుణాల కింద క్రెడిట్‌ కార్డులు, పర్సనల్‌ లోన్లు, కన్జ్యూమర్‌ రుణాలు ఇస్తున్నారు. మిలీనియల్స్‌ రుణాల్లో 72 శాతం ఇవే ఉంటున్నాయని సిబిల్‌ నివేదించింది. ఇక మిలీనియల్స్‌ తీసుకుంటున్న రుణాల్లో సురక్షిత (సెక్యూర్డ్‌) రుణాల కిందకు వచ్చే వాహన రుణాలు 9 శాతం ఉన్నట్లు సిబిల్‌ వెల్లడించింది. తమ క్రెడిట్‌ స్కోరుపై మిలీనియల్స్‌ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, స్కోరును పర్యవేక్షించుకుంటున్నారని పేర్కొంది. సాధారణంగా తమ ధోరణిని మార్చుకునే తీరుతో వీరు ఉంటారని, 700 కంటే తక్కువ స్కోరు కలిగిన వారిలో 51 శాతం మంది ఆరు నెలల్లోనే తమ క్రెడిట్‌ స్కోరును మెరుగుపరుచుకున్నారని వివరించింది. 740- 900 మధ్య స్కోరు ఉంటే మెరుగైనదిగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పరిగణిస్తుంటాయి.  



You may be interested

‘ఓలా’లా...!

Wednesday 13th November 2019

‘కిచిడీ’ ద్వారా భారీగా ఆహార వ్యాపారంలోకి మరిన్ని సొంత ఫుడ్‌ బ్రాండ్లపై కసరత్తు... క్లౌడ్‌ కిచెన్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ ట్రక్కుల ఏర్పాటు బెంగళూరు: ట్యాక్సీ సేవల్లో దూసుకెళ్తున్న ఓలా... ఇకపై నోరూరించే వంటకాలతో ఆహార ప్రియులను ఆకర్షించనుంది. రాబడులు పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా సంస్థ కొత్త ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టింది. తాజాగా ఆహార వ్యాపార విభాగంలో భారీగా విస్తరిస్తోంది. దీనికోసం సొంత ఫుడ్‌ బ్రాండ్స్‌నూ ప్రవేశపెడుతోంది. స్విగీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ

భారత్‌లో కష్టమే..

Wednesday 13th November 2019

మరిన్ని పెట్టుబడులు పెట్టేదిలేదు ప్రభుత్వ తోడ్పాటు లేకపోతే ఇక అంతే.. వోడాఫోన్‌ యూకే సీఈఓ నిక్‌రీడ్‌ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పుతో వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తే భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించడం కష్టమేనని బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్‌ సీఈవో నిక్ రీడ్ వ్యాఖ్యానించారు. వొడాఫోన్‌- ఐడియా జాయింట్ వెంచర్‌ మరింత సంక్షోభంలో కూరుకుపోకుండా చూసేందుకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక

Most from this category