News


స్టార్టప్‌లకు మైక్రోసాఫ్ట్‌ దన్ను

Tuesday 25th June 2019
Markets_main1561438981.png-26551

  • ఎమ్‌ 12 వెంచర్‌ ఫండ్‌ ద్వారా స్టార్టప్‌లకు కొత్త విలువ

 బెంగళూరు: స్టార్టప్‌ల తర్వాతి దశ వృద్ధికి ఇతోధికంగా తోడ్పాడతామని టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. తమ ఎమ్‌12 అనే వెంచర్‌ ఫండ్‌ ద్వారా భారత్‌లో స్టార్టప్‌లకు కొత్త విలువ సృష్టిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి పేర్కొన్నారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల వృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నామన్నారు. స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి తగిన సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తున్నామని మహేశ్వరి, ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా ఉపయోగపడేలా స్టార్టప్‌లకు చేయూతనిస్తున్నామని వివరించారు. 
స్టార్టప్‌లు విజయవంతమైన వ్యాపార సంస్థలుగా రూపొందడానికి ‘మైక్రోసాఫ్ట్‌ ఫర్‌ స్టార్టప్స్‌’ పేరిట తాము ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్‌ తోడ్పాటునందిస్తున్నట్లు ‘మైక్రోసాఫ్ట్‌ ఫర్‌ స్టార్టప్స్‌’ కంట్రీ హెడ్‌ లతిక పాయ్‌ తెలియజేశారు. మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ మార్కెట్‌ ప్లేస్‌, ఎంటర్‌ప్రైజ్‌ సేల్స్‌ టీమ్‌, భారీ స్థాయిలో ఉన్న ఇతర భాగస్వామ్య సంస్థలు... ఈ అంశాలన్నీ స్టార్టప్‌లకు అంతర్జాతీయంగా వినియోగదారులు లభించేలా చూస్తాయని పేర్కొన్నారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే స్టార్టప్‌లకు 120 ఒప్పందాలు కుదిరేలా చూశామని తెలిపారు. 13 కోట్ల డాలర్ల డీల్స్‌ ప్రస్తుతం సంప్రతింపుల దశలో ఉన్నట్లు తెలియజేశారు. 



You may be interested

డీవీఆర్‌ షేర్లకు కొత్త నిబంధనలు !

Tuesday 25th June 2019

సెబీ కసరత్తు  న్యూఢిల్లీ: డిఫరెన్షియల్‌  ఓటింగ్‌ రైట్స్‌(డీవీఆర్‌) షేర్లకు సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ యోచిస్తోంది. కంపెనీపై తమ నియంత్రణను కోల్పోకుండానే డీవీఆర్‌ షేర్ల జారీ ద్వారా ప్రస్తుతం ప్రమోటర్లు నిధులు సమీకరించుకోవచ్చు. డీవీఆర్‌ షేర్లు ఈక్విటీ షేర్లలాగానే ఉంటాయి. కానీ ఓటింగ్స్‌ రైట్స్‌ తక్కువగా ఉంటాయి. తమ కంపెనీ బలవంతపు టేకోవర్‌కు గురి కాకుండా ఉండటం కోసం సాధారణంగా ప్రమోటర్లు ఈ డీవీఆర్‌ షేర్లను

ఆధార్‌ ప్రింట్‌ చేసినంత ఈజీ కాదు

Tuesday 25th June 2019

‘ఎలక్ట్రిక్‌’కు మారడంపై టీవీఎస్‌, బజాజ్‌ ఆటో విమర్శలు పూర్తి సప్లయ్‌ చెయిన్‌ను ఏర్పాటు చేయాలని సూచన నీతి ఆయోగ్‌ ప్రతిపాదన పట్ల అభ్యంతరం న్యూఢిల్లీ: త్రిచక్ర వాహనాలను 2023 నుంచి, ద్విచక్ర వాహనాలను 2025 నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్‌ రూపంలోనే అనుమతించాలన్న నీతి ఆయోగ్‌ ప్రతిపాదనపై అగ్రశ్రేణి ఆటో కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. ఇదేమీ ఆధార్‌ కార్డును ప్రింట్‌ చేసింత ఈజీ కాదని టీవీఎస్‌, బజాజ్‌ ఆటో వ్యాఖ్యానించాయి. ఈ ప్రతిపాదనల వెనక తగినంత

Most from this category