News


విండోస్‌ 7కు అప్‌డేట్స్‌ నిలిపివేత

Thursday 20th June 2019
news_main1561016503.png-26442

- వచ్చే ఏడాది జనవరి 14 నుంచి అమల్లోకి

జైపూర్:  టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి సెక్యూరిటీ, టెక్నికల్ అప్‌డేట్స్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 2020 జనవరి 14 నుంచి అప్‌డేట్స్‌ను నిలిపేస్తామని, యూజర్లు మెరుగైన లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌కు మారాల్సి ఉంటుందని పేర్కొంది. యూజర్లు సులభంగా కొత్త ఓఎస్‌కు మారేలా బైబ్యాక్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్లు ప్రకటించడంతో  పాటు చౌకగా డివైస్‌లను తయారు చేసేలా డెల్‌, హెచ్‌పీ వంటి కంప్యూటర్స్ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వివరించింది."2020 జనవరి 14 నుంచి విండోస్ 7కు సపోర్ట్‌ నిలిపివేస్తున్నాం. ఆ తర్వాత నుంచి ఈ ఆపరేటింగ్‌ సిస్టంకు సంబంధించి సెక్యూరిటీ, టెక్నికల్‌ అప్‌డేట్స్ లభించవు. కాబట్టి ఈ ఓఎస్‌పై నడిచే కంప్యూటర్ డివైజ్‌లకు రిస్కులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని లేటెస్ట్‌ ఓఎస్‌కు అప్‌గ్రేడ్ కావడం శ్రేయస్కరం" అని మైక్రోసాఫ్ట్ ఇండియా గ్రూప్‌ డైరెక్టర్ ఫర్హానా హక్‌ తెలిపారు. వినియోగదారులు విండోస్‌ 10 ఆధారిత పీసీ, ల్యాప్‌టాప్‌ లేదా ట్యాబ్‌లను కొనుగోలు చేయొచ్చని, వీటిల్లో మరింత సురక్షితమైన, అప్‌డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయని వివరించారు. టెక్‌ఐల్‌ నివేదిక ప్రకారం దేశీ చిన్న తరహా సంస్థలు నాలుగేళ్ల క్రితం నాటి కంప్యూటర్‌ నిర్వహణపై సగటున రూ. 93,500 ఖర్చు చేస్తున్నాయని.. ఇది దాదాపు మూడు కొత్త తరం కంప్యూటర్స్‌ రేటుకు సరిసమానమని హక్‌ పేర్కొన్నారు. 



You may be interested

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లో బీఎఫ్‌ఐఎల్‌ విలీనం

Thursday 20th June 2019

రికార్డ్‌ డేట్‌ వచ్చే నెల 4  న్యూఢిల్లీ: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ (బీఎఫ్‌ఐఎల్‌) విలీనం వచ్చే నెల 4 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఇరు కంపెనీలు తమ తమ వాటాదారులకు, రుణదాతలకు సమాచారమిచ్చాయి. అదే రోజును రికార్డ్‌ డేట్‌గా కూడా పరిగణిస్తామని పేర్కొన్నాయి. ఆ రోజు నాటికి ఎవరైతే బీఎఫ్‌ఐఎల్‌ వాటాదారులుగా ఉంటారో వారికి ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌​ షేర్లు లభిస్తాయి. ప్రతి 1,000

జోరుమీదున్న లాజిస్టిక్స్‌!

Thursday 20th June 2019

2020 నాటికి 215 బిలియన్‌ డాలర్లకు 3.8 కోట్ల చ.అ. స్థలం అందుబాటులోకి కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ అంచనా హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో లాజిస్టిక్, వేర్‌ హౌజ్‌ విభాగం ఫుల్‌ జోష్‌లో ఉంది. మౌలిక రంగ హోదా, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వంటి నిర్మాణాత్మక సంస్కరణల అమలు వల్ల దేశీయ లాజిస్టిక్‌ విభాగంలో డిమాండ్‌ పెరిగింది. ఈ ఏడాది ముగిసే నాటికి దేశంలో 3.8 కోట్ల చదరపు అడుగుల లాజిస్టిక్‌ అండ్‌

Most from this category