News


సత్యా నాదెళ్ల భారత పర్యటన

Friday 14th February 2020
news_main1581650535.png-31775

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) సత్యా నాదెళ్ల భారత్‌లో పర్యటించనున్నారు. తెలుగువాడైన నాదెళ్ల ఈ నెల 24-26 తేదీల్లో తన సొంత దేశంలో ఉండనున్నారు. కస్టమర్లు, యువ సాధకులు, విద్యార్థులు, డెవలపర్లు, టెక్‌ సంస్థల వ్యవస్థాపకులను కలిసేందుకు ఈయన భారత్‌ వస్తున్నారని ఒక ఈ-మెయిల్‌ ప్రశ్నకు కంపెనీ బదులిచ్చింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో నాదెళ్ల పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సంస్థ చీఫ్‌ హోదాలో ఇప్పటికే పలు మార్లు ఈయన భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే కాగా, ఈ సారి పర్యటన ఎందుకనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు కంపెనీ స్పష్టంచేయలేదు. 



You may be interested

నిఫ్టీ మద్దతు12,134 పాయింట్లు

Friday 14th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 18 పాయింట్లు ప్లస్‌  ఎస్‌అండ్‌పీ స్టేబుల్‌ ఔట్‌లుక్‌ రేటింగ్‌ గురువారం యూఎస్‌ మార్కెట్లు డీలా నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో(గ్యాపప్‌) ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30 ప్రాంతం‍లో 18 పాయింట్లు పుంజుకుని 12,192 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,174పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. విదేశీ సంస్థ

అపోలో హాస్పిటల్స్‌ లాభం 80 శాతం అప్‌

Friday 14th February 2020

అపోలో హాస్పిటల్స్‌ లాభం 80 శాతం అప్‌ రూ.90 కోట్లకు నికర లాభం  ఒక్కో షేర్‌కు రూ.3.25 మధ్యంతర డివిడెండ్‌  న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 80 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ3లో రూ.50 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.90 కోట్లకు పెరిగిందని అపోలో హాస్పిటల్స్‌  ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరచడంతో నికర

Most from this category