STOCKS

News


ఫార్చ్యున్‌ జాబితాలో సత్యనాదెళ్ల టాప్!

Wednesday 20th November 2019
news_main1574244760.png-29735

 భారతి సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదేళ్ల, ఈ ఏడాది ‘ఫార్చ్యున్స్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ జాబితాలో ‍ప్రథమ స్థానంలో ఉన్నారు. ఈయనతో పాటు భారతీ య సంతతికి చెందిన అజయ్‌ బంగా(మాస్టర్‌ కార్డ్‌ సీఈఓ), జయశ్రీ ఉల్లాల్‌(ఆరిస్టా హెడ్‌) కూడా ఈ లిస్ట్‌లో చోటు సంపాదించారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలిగి, ఆసాధ్యమైన అసమానతలను అధిగమించగలిగి, సృజనాత్మక పరిష్కారాలను కనుగొనే 20 వ్యాపార నాయకులను ఫార్య్చున్‌ తన వార్షిక ‘బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ జాబితాలో చోటిస్తుంది. కాగా ఫార్చ్యున్‌ ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో సత్య నాదేళ్ల టాప్‌లో నిలిచారు.  ‘రాజకీయ గందరగోళం తన ఆధిపత్యాన్ని కొనసాగించిన ఈ సంవత్సరంలో, జట్టు-ఆధారిత నాయకత్వ లక్షణాలు మా కొత్త నంబర్ 1 బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌ను నడిపించాయి’ అని ఫార్చ్యున్‌ తెలిపింది. కాగా ఈ జాబితాలో బం‍గా 8 స్థానాన్ని సంపాదించగా, ఉల్లాల్‌ 18 వ స్థానంలో నిలిచారు. ఈ జాబితా కోసం క్యాపిటల్‌పై షేర్‌ హోల్డర్లకు ఎంత రాబడి వచ్చింది వంటి పది అంశాలను ఫార్య్చున్‌ పరిశీలించింది. 
    ‘సత్య నాదేళ్లకు 2014లో మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా పగ్గాలు అందించే సమయానికి ఆయన కేవలం ఓ కంప్యూటర్‌ శాస్త్రవేత్త మాత్రమే. ముందటి సీఈఓ స్టీవ్‌ బాల్‌మర్‌లా సేల్స్‌​లీడర్‌ కాదు, అలానే బిల్‌గేట్స్‌లా మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు కాదు’ అని ఫార్య్చున్‌ తెలిపింది. ‘అతనెప్పుడు ఫైనాన్స్‌ విభాగంలో పనిచేయలేదు. అలానే సీఈఓ కోసం శిక్షణ తీసుకోలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన మైక్రోసాఫ్ట్‌లో చేరిన 1992 సంవత్సరం నుంచి కంపెనీలో పోటిని తట్టుకొని నిలబడ్డాడు’ అని పేర్కొంది. ‘ప్రస్తుతం నాదెళ్ల తన రెస్యుమ్‌లోని లోపాలను, జీన్స్‌, బ్లేజర్స్‌ వేసుకునేంత సులువుగా అధిగమించారు’ అని అభిప్రాయపడింది. ‘ఆయన నాయకత్వ లక్షణంలో కీలకమైనది ఆయన టీం వర్క్‌కు అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వడం. విధాన పరమైన, న్యాయపరమైన అంశాలను చూసే ప్రెసిడెంట్‌ బ్రాడ్‌ స్మిత్‌, మైక్రోసాఫ్ట్‌ ముఖ్య వాణిజ్యఅధికారి అమి హుడ్‌, చీఫ్‌ పీపుల్‌ అధికారి కత్లెన్‌ హోగన్‌ ఆయన మేనేజ్‌మెంట్‌ టీంలో ఉండే ముఖ్యమైన వ్యక్తులు‘ అని తెలిపింది. ‘మంచి టీం ఉంటే సీఈఓ తను ఏం చేయాలనుకుంటాడో అది చేయగలడు. అదృష్టం కొద్ది నాకు అటువంటి టీం లభించింది’ అని నాదెళ్ల అన్నారని ఫార్చ్యున్‌ కోట్‌ చేసింది.  
అజయ్‌ బంగాకు సంబంధించి..‘బంగా ముందచూపుకి ధన్యవాదాలు’ అని ఫార్చ్యున్‌ పేర్కొంది. ప్రస్తుతం మాస్టర్‌ కార్డ్‌ వృద్ధి చెందింది. ఈ ఏడాది ఈ కంపెనీ స్టాక్‌ 40 శాతానికి పైగా పెరిగింది’ అని తెలిపింది. ‘కంపెనీ లేదా సమాజం ఎదగాలంటే భిన్నత్వం ఉండాలి. భిన్నత్వం ముఖ్యమని మేం గుర్తించాం. మా చుట్టుపక్కలా భిన్నమైన అనుభవాలు ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని బంగా అన్నారని ఫార్చ్యున్‌ కోట్‌ చేసింది. ఆయన విజయాలకు గుర్తింపుగా బంగాకు గతేడాది ప్రతిష్టాత్మక ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్ అవార్డు లభించింది. 
   జయశ్రీ ఉల్లాల్‌ సిస్కోను 2008లో విడిచి పెట్టి ఆరిస్టాలో చేరారు. అప్పటి నుంచి ఈ కంపెనీని ఈథర్నెట్ స్విచ్స్‌, ఓపెన్ సోర్స్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌లో కీలకమైన కంపెనీగా నిలిపారు. ఈ కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్‌ 2018లో 31.5 శాతానికి చేరుకుంది. కాగా ఈ సమయంలోనే సిస్కో 28 శాతం అపరేటింగ్‌ మార్జిన్‌ను నమోదు చేసింది. ‘భారత్‌-అమెరికా సంతతికి చెంది లండన్‌లో పుట్టిన ఉల్లాల్‌ డిల్లీలో పెరిగారు’ అని ఫార్చ్యున్‌ తెలిపింది. కంపెనీ ఆర్థిక పనితీరు బాగలేనప్పటికి  ఆరిస్టాను కొత్త శిఖరాలకు నడిపించడానికి, అనుభవమున్న ఉల్లాల్‌ ఉన్నారని విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు’ అని ఈ ఫార్చ్యున్‌ అభిప్రాయపడింది.  
ఫార్చ్యున్‌ విడుదల చేసిన ఈ జాబితాలో పెర్త్‌కు చెందిన ఫోర్టెస్క్యూ మెటల్స్ గ్రూప్ సీఈఓ ఎలిజబెత్ గెయిన్స్ రెండవ స్థానంలో, ప్యూమా సీఈవో జోర్న్ గుల్డెన్ 5 వ స్థానంలో, జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జామీ డిమోన్ 10 వ స్థానంలో, యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ 15 వ స్థానంలో, అలీబాబా సీఈఓ డేనియల్ జాంగ్ 16 వ స్థానంలో ఉన్నారు. You may be interested

మూడోరోజూ లాభాల ముగింపే..!

Wednesday 20th November 2019

  ఇంట్రాడేలో కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌  11999 వద్ద ముగిసిన నిఫ్టీ  రాణించిన ఫార్మా, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు  సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. ఐనప్పటికీ వరుసగా మూడోరోజూ లాభంతో ముగిశాయి. ఫార్మా, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్‌ 182 పాయింట్ల లాభంతో 40,652 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 59 పాయింట్ల పెరిగి 11999.10  వద్ద ముగిసింది. సూచీలకిది వరుసగా మూడోలాభాల ముగింపు కావడం

4 సెషన్లలో 170 శాతం ర్యాలీ.. ఇప్పుడు కొనొచ్చా?

Wednesday 20th November 2019

వీఐఎల్‌ షేరుపై నిపుణుల సూచన గత నాలుగు సెషన్లులో వొడాఫోన్‌ ఐడియా షేరు దాదాపు 170 శాతం ర్యాలీ జరిపింది. డిసెంబర్‌ 1నుంచి టారిఫ్‌లు పెంచుతామన్న కంపెనీ ప్రకటన షేరుపై ఆసక్తి పెంచింది. వీఐఎల్‌తో పాటు ఎయిర్‌టెల్‌, జియో సైతం రేట్లు పెంచుతామని ప్రకటించాయి. మరోవైపు ఐటీ శాఖ నుంచి కంపెనీకి రూ. 7వేల కోట్లు రావాల్సిఉంది. ఈ రిఫండ్‌ కోరుతూ కంపెనీ ఐటీ శాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. ఒకపక్క

Most from this category