STOCKS

News


హైదరాబాద్‌లో మైక్రాన్ డెవలప్‌మెంట్ సెంటర్‌

Saturday 5th October 2019
news_main1570249854.png-28728

- భారత్‌లో 2,000 దాకా సిబ్బంది పెంపు యోచన
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్‌ టెక్నాలజీ తాజాగా హైదరాబాద్‌లో గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (జీడీసీ)ని ఆవిష్కరించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ శుక్రవారమిక్కడ దీన్ని ప్రారంభించారు. మైక్రాన్ వంటి దిగ్గజ సంస్థ హైదరాబాద్‌లో తమ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా కేటీఆర్‌ చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్స్‌ ఉన్నాయని, ఈ విభాగంలో పెట్టుబడులకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయన్నారు. సెమీకండక్టర్స్‌ తయారీ యూనిట్‌ను కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు, సుమారు 3,50,000 చ.అ. విస్తీర్ణంలో ఈ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో సంజయ్‌ మెహ్‌రోత్రా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన బెంగళూరు కార్యాలయంతో పాటు హైదరాబాద్‌ జీడీసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 700 దాకా ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని 2,000 దాకా పెంచుకోనున్నట్లు, ఇందులో ఎక్కువగా నియామకాలు హైదరాబాద్‌ కేంద్రంలోనే ఉండనున్నట్లు మెహ్‌రోత్రా వివరించారు. ప్రస్తుతం తమకు జపాన్, చైనా సహా ఆరు దేశాల్లో తయారీ కార్యకలాపాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 

డేటా విప్లవంతో అవకాశాలు: కాంత్‌
డేటా విప్లవంతో  రాబోయే రోజుల్లో ఈ రంగంలో అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కాంత్ చెప్పారు. భారత్‌లో సమస్యలకు పరిష్కారాలను కనుగొనగలిగితే ఇతర దేశాల్లోనూ వాటిని అమలు చేయడం సులభతరం అవుతుందని తెలిపారు. పటిష్టమైన ప్రభుత్వ విధానాలతో గడిచిన పధ్నాలుగేళ్లలో దేశీయంగా 30 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బైటపడ్డారని కాంత్‌ చెప్పారు. 



You may be interested

పండుగ సీజన్లో గోల్డ్‌ బాండ్‌ ధమాకా

Saturday 5th October 2019

సోమవారం ఇష్యూ ప్రారంభం గ్రాము ధర రూ.3,788 న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో భౌతిక పసిడి కొనుగోళ్లను తగ్గించి, ఆ మొత్తాలను పూర్తిస్థాయి ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చడానికి కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా అక్టోబర్‌ 7వ తేదీన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20- సిరీస్‌ 5కు శ్రీకారం చుట్టింది. ఈ సిరీస్‌లో పసిడి గ్రామ్‌ ఇష్యూ ధర రూ.3,788గా నిర్ణయించింది. అక్టోబర్‌ 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ స్కీమ్‌

చిన్న నగరాల నుంచీ ఆన్‌‘లైన్‌’

Saturday 5th October 2019

ఈ-కామర్స్‌ అంటే నమ్మకం పెరిగింది అన్ని పిన్‌ కోడ్స్‌కు సరుకుల సరఫరా అమెజాన్‌ డైరెక్టర్‌ షాలిని పుచ్చలపల్లి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ‘నా చిన్నప్పుడు ఊర్లో వస్తువులు ఏవీ దొరికేవి కావు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవి కావు. వచ్చినా ఖరీదెక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ-కామర్స్‌ రాకతో ప్రపంచంలో లభించే ఏ వస్తువైనా ఆర్డరు చేయవచ్చు’ అని అమెజాన్‌ ఇండియా కేటగిరీ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ షాలిని పుచ్చలపల్లి అన్నారు. అమెజాన్‌ ఫెస్టివ్‌ యాత్రలో భాగంగా

Most from this category