News


మరో 5 మెట్రో క్యాష్‌ అండ్‌ క్యార్టీ సోర్లు

Monday 24th February 2020
news_main1582513829.png-32025

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఏడాది అదనంగా మరో 5 మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్లను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ సంస్థకు పస్తుతం దేశవ్యాప్తంగా 17 పట్టణాల్లో 27 క్యాష్‌ అండ్‌ క్యారీ దుకాణాలున్నాయి. అలాగే, కిరాణా స్టోర్లతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు, ఈకామర్స్‌లోనూ విస్తరణ బాట పట్టనున్నట్టు వెల్లడించింది. ఈ సంస్థ భారత కార్యకలాపాలపై గత రెండేళ్ల నుంచీ లాభాలను ఆర్జిస్తోంది. హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీలో 2,000 కిరాణా స్టోర్లతో ఇప్పటి వరకు భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్‌లో ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో విస్తరణకు భారీ అవకాశాలు ఉన్నాయని మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా ఎండీ, సీఈవో అరవింద్‌ మెదిరట్ట తెలిపారు. కిరాణా స్టోర్ల అమ్మకాలు పెంచుకునేందుకు తాము సాయం అందిస్తామని, దాంతో ఆయా వర్తకులకు తాము ప్రాధాన్య సరఫరాదారుగా మారతామని వివరించారు. 



You may be interested

చిన్నారి బీమా... ధీమానిస్తుందా..?

Monday 24th February 2020

ఇవి ఎండోమెంట్‌, యులిప్‌ ప్లాన్లు వీటిల్లో పెట్టుబడులతో పాటు బీమా పాలసీదారు మరణించినా పెట్టుబడుల కొనసాగింపు కానీ, వీటిల్లో చార్జీలు ఎక్కువ రాబడులు చాలా తక్కువ బీమా కవరేజీ కూడా అంతంతే పూర్తి కవరేజీతో టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవడం మేలైనది పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నవి చైల్డ్‌ ప్లాన్లు. అయితే, వీటి గురించి పూర్తిగా తెలిసినది అతి తక్కువ మందే. బీమా ఏజెంట్లు చైల్డ్‌ ప్లాన్ల గురించి ఆకర్షణీయమైన అంశాలు... ఆకర్షణీయ రాబడుల గణాంకాలను చూపించినప్పుడు

ఈ వారం స్టాక్‌ సిఫార్సులు

Monday 24th February 2020

శ్రీ సిమెంట్స్‌ :    కొనచ్చు  బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ.24,367 టార్గెట్‌ ధర: రూ.27,900 ఎందుకంటే: శ్రీ సిమెంట్స్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. విద్యుత్తు విభాగం పనితీరు అంతంతమాత్రంగానే ఉండటంతో మొత్తం ఆదాయం 2 శాతమే వృద్ధి చెంది రూ.2,848 కోట్లకు పెరిగింది. సిమెంట్‌ అమ్మకాలు మాత్రం 5 శాతం వృద్ధితో 6.25 మిలియన్‌ టన్నులకు చేరాయి. రియలైజేషన్లు ఒక్కో టన్నుకు రూ.4,508గా

Most from this category