News


‘టాటా ఉప్పు’... కంపెనీ మారింది!!

Thursday 16th May 2019
news_main1557991976.png-25770

  • గ్రూపు వినియోగ వస్తువుల వ్యాపారం పునర్వ్యవస్థీకరణ
  • టాటా కెమికల్స్‌ ఆహారోత్పత్తులు గ్లోబల్‌ బెవరేజెస్‌కు
  • ప్రతీ టాటా కెమికల్‌ షేరుకు 1.14 గ్లోబల్‌ బెవరేజెస్‌ షేర్లు

న్యూఢిల్లీ: టాటా గ్రూపులో వ్యాపార పునర్వ్యవస్థీకరణ దిశగా ఓ కీలక నిర్ణయం జరిగింది. టాటా కెమికల్స్‌కు చెందిన ఆహారోత్పత్తుల వ్యాపారం టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌లో విలీనం కానుంది. ఈక్విటీ షేర్ల జారీ రూపంలో ఈ వ్యాపార విలీనం ఉంటుందని టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌ (టీసీఎల్‌) తెలిపింది. ప్రతీ టాటా కెమికల్‌ షేరుకు 1.14 టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ షేర్లు కేటాయిస్తారు. టాటా కెమికల్స్‌కు చెందిన ఉప్పు, మసాలాలు, పప్పులు తదితర ఆహారోత్పత్తులను టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ (టీజీబీఎల్‌) పరం అవుతాయి. ఆ తర్వాత టీజీబీఎల్‌ పేరును టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌గా మారుస్తారు. దీంతో రూ.9,099 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీగా టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ అవతరిస్తుంది. ఈ మేరకు టాటా కెమికల్స్‌, టీజీబీఎల్‌ కంపెనీల బోర్డులు బుధవారం సమావేశమై నిర్ణయాలు తీసుకున్నాయి. టాటా కెమికల్స్‌ నుంచి కన్జ్యూమర్‌ ఉత్పత్తుల వ్యాపారాన్ని వేరు చేసి, టీజీబీఎల్‌కు బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపాయి. వాటాదారులు, స్టాక్‌ ఎక్సేంజ్‌లు, నియంత్రణ సంస్థల ఆమోదం అనంతరం ఈ వ్యాపార విలీనం జరుగుతుంది. 
వృద్ధికి మరింత అవకాశం...
ఇరు కంపెనీల వినియోగదారుల ఆధారిత వ్యాపారాన్ని ఏకం చేయడం వల్ల ఆహారం, పానీయాల మార్కెట్లో వాటా పెంచుకోవచ్చని, దీనివల్ల రెండు కంపెనీల వాటాదారులు ప్రయోజనం పొందుతారని కంపెనీ నుంచి విడుదలైన ప్రకటన పేర్కొంది. టీజీబీఎల్‌ టాటా టీ, టెట్లే పేరుతో టీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఎయిట్‌ ఓ క్లాక్‌ బ్రాండ్‌ కింద కాఫీని, ఇంకా బాటిల్డ్‌ వాటర్‌, గ్లూకోవిటా తదితర ఉత్పత్తులను సైతం మార్కెట్‌ చేస్తోంది. టాటా కాఫీ కూడా టీజీబీఎల్‌ అనుబంధ సంస్థే. ఇక టాటా కెమికల్స్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద సోడా యాష్‌ తయారీదారు. కన్జ్యూమర్‌ ఉత్పత్తుల వ్యాపారాన్ని డీమెర్జ్‌ చేసిన తర్వాత టాటా కెమికల్స్‌ పూర్తిగా బేసిక్‌, స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీగా కొనసాగుతుంది. ‘‘ఎఫ్‌ఎంసీజీ విభాగంలో ఫుడ్‌, బెవరేజెస్‌ పరంగా టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ స్థానం బలపడుతుంది. దేశీయ వినియోగదారుల పెరుగుతున్న ఆకాంక్షలను చేరుకునేందుకు ఈ విలీనం ద్వారా బలమైన ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేశాం’’ అని టాటా గ్రూపు చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. 
నవ్యత కావాలి...
తన ప్రధాన ఉత్పత్తుల విషయంలో టీజీబీఎల్‌కు నవ్యత అవసరమని ఎన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు. మరింత వృద్ధి అవకాశాల కోసం ఎంచుకున్న ప్రాంతాల్లో వ్యాపారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరపు టీజీబీఎల్‌ కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. అవకాశాలను సొంతం చేసుకునే విధంగా భవిష్యత్తు విధానాలు ఉండాలని, అందుకు తగిన విధంగా సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు ఆకాంక్షలను చేరుకునేందుకు శక్తిమంతమైన టాటా బ్రాండ్‌ ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. You may be interested

ఈ స్టాకుల పీఈ పెరిగింది.. అమ్మేయాలా?

Thursday 16th May 2019

ఇటీవల కాలంలో సూచీలపై కరెక‌్షన్‌ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ప్రధాన సూచీలు తమ ఆల్‌టైమ్‌ గరిష్టాల నుంచి దాదాపు 5,6 శాతం దిగువకు పతనమైనాయి. కానీ నిఫ్టీలోని 22 స్టాకులు మాత్రం ఇప్పటికీ తమ పదేళ్ల పీఈ సరాసరి కన్నా ప్రీమియంతోనే ట్రేడవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. స్టాక్‌ ధర వాల్యూషన్‌ను పీఈ ఆధారంగా మదింపు చేస్తారు. పీఈ అధికంగా ఉంటే వాల్యూషన్లు ఎక్కువగా ఉన్నట్లు లెక్కిస్తారు. ఇలా అధిక వాల్యూషన్‌

‘జెట్‌’ విక్రయంలో కదలిక!

Thursday 16th May 2019

ఎస్బీఐ క్యాప్స్‌తో డార్విన్‌ గ్రూపు భేటీ రూ.14,000 కోట్ల డీల్‌కు ప్రతిపాదన తెరపైకి హిందుజా సోదరులు ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు ఆసక్తి చూపించిన డార్విన్‌ గ్రూపు బుధవారం ఎస్‌బీఐ క్యాప్స్‌తో భేటీ అయింది. జెట్‌ను అప్పులతో సహా సొంతం చేసుకునేందుకు రూ.14,000 కోట్లను ఇవ్వజూపినట్టు సమావేశం అనంతరం డార్విన్‌ గ్రూపు సీఈవో రాహుల్‌ గన్‌పులే తెలిపారు. ఆయిల్‌ అండ్‌గ్యాస్‌, హాస్పిటాలిటీ, రియల్టీ తదితర రంగాల్లో డార్విన్‌ గ్రూపునకు పెట్టుబడులున్నట్టు గ్రూపు తెలియజేసింది. ‘‘ఎస్‌బీఐ

Most from this category