News


మార్కెట్లోకి మెర్సిడెజ్‌ బెంజ్‌ వీ-క్లాస్‌ ఎలైట్‌

Friday 8th November 2019
news_main1573185512.png-29433

  • ధర రూ. 1.10 కోట్లు 
  • 11 సెకన్లలో సున్నా నుంచి 100కి.మీ వేగం

చెన్నై: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌.. కొత్త మల్టీ-పర్పస్‌ వెహికిల్‌ ‘వీ–క్లాస్ ఎలైట్’ను గురువారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీ–క్లాస్ ఎక్స్‌ప్రెషన్, వీ–క్లాస్ ఎక్స్‌క్లూజివ్‌ కార్లకు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా విడుదలైన ఈ విలాసవంతమైన కారు ధర రూ. 1.10 కోట్లు. భారత్‌ స్టేజ్‌–6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ కారులో 2.0-లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చింది. 9జీ-ట్రానిక్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కేవలం 11 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. స్టీల్ బ్లూ, సెలెనైట్ గ్రే, గ్రాఫైట్ గ్రే రంగుల్లో నూతన వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. స్పెసిఫికేషన్స్‌ విషయానికి వస్తే.. మసాజింగ్ ఫంక్షన్ కలిగిన ఆరు సీట్లు, రిమోట్ కంట్రోల్డ్ డోర్, 15 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌, ఎజిలిటీ కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నట్లు కంపెనీ వివరించింది. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే కార్లను ప్రతి నెలకు ఒకటి చొప్పున విడుదల చేయనున్నామని ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ ష్వెంక్ అన్నారు. 



You may be interested

వ్యాపార నిర్వహణకు సౌకర్యంగా ఉండాలి

Friday 8th November 2019

-ఉచిత తాయిలాలు కాదు -ప్రధాని నరేంద్ర మోదీ ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్‌): ఉచిత తాయిలాలకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పారదర్శకమైన, సులభతర వ్యాపార నిర్వహణకు అనుగుణంగా నిబంధనలు ఉండాలేకానీ, ఉచిత విద్యుత్తు, చౌకగా భూమి, పన్ను రాయితీలు కాదన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణకు ధర్మశాలలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించి మాట్లాడారు. 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల (రూ.350

ఆర్థిక రంగ పరిస్థితులపై మంత్రి సీతారామన్‌ సమీక్ష

Friday 8th November 2019

ఆర్‌బీఐ గవర్నర్‌ సహా ప్రముఖుల హాజరు న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితి, ఈ రంగంలో ఉన్న ఒత్తిళ్లు తదితర అంశాలపై ‘ఆర్థిక రంగ స్థిరత్వం, అభివృద్ధి కౌన్సిల్‌’ (ఎఫ్‌ఎస్‌డీసీ) 21వ సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమీక్ష చేశారు. గురువారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ తదితర కీలక ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎఫ్‌ఎస్‌డీసీ అనేది ఆర్థిక

Most from this category