News


యథాప్రకారంగానే బ్యాంకుల విలీనం

Friday 27th March 2020
news_main1585282572.png-32700

  • ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సమస్యలు ఉన్నప్పటికీ .. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ప్రక్రియ యథాప్రకారంగానే కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి విలీనాలు అమల్లోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా బ్యాంకుల విలీనానికి డెడ్‌లైన్‌ పొడిగించే అవకాశముందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ .. "ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదు" అని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో డెడ్‌లైన్‌ను కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలంటూ అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ తాజా వ్యాఖ్యలు ప్రాాన్యం సంతరించుకున్నాయి. కోవిడ్‌-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుండటంతో బ్యాంకింగ్ సేవలపైనా ప్రతికూల ప్రభావం ఉంటోంది.


 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు భారీ బ్యాంకర్లుగా విలీనం చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా.. విలీన ప్రక్రియ పూర్తయితే ఏడు భారీ బ్యాంకులు, అయిదు చిన్న బ్యాంకులు ఉంటాయి. ప్రణాళిక ప్రకారం.. పంజాబ్‌ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమవుతున్నాయి. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకును, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకును, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్‌.. కార్పొరేషన్ బ్యాంకును విలీనం చేస్తున్నారు.  



You may be interested

సెన్సెక్స్‌.. రాకెట్‌ స్పీడ్‌

Friday 27th March 2020

31,000 పాయింట్ల ఎగువకు నిఫ్టీ 330 పాయింట్ల హైజంప్‌ అన్ని రంగాలూ లాభాల్లోనే మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 3 శాతం అప్‌ సెన్సెక్స్‌ 1150 పాయింట్లు ప్లస్‌ ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌ దూకుడు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు జోరందుకున్నాయి.  ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇండెక్సులు మరోసారి దూకుడు చూపుతున్నాయి. తొలుత సెన్సెక్స్‌  1150 పాయింట్లు దూసుకెళ్లి 31,105కు చేరింది. తద్వారా తిరిగి 31,000 పాయింట్ల

టీవీలు, ఫ్రిజ్‌లకు ‘‘వైరస్‌’’...!

Friday 27th March 2020

గత ఏడాది పుంజుకున్న అమ్మకాలు  ఈ ఏడాది అమ్మకాలకు కరోనా గ్రహణం  పెరిగిన పన్నులు  సరఫరా చెయిన్‌లో సమస్యలు  కుదేలైన డిమాండ్‌  ప్రతికూలతలున్నా, ధరలు పెంచాల్సిన పరిస్థితి  రెండేళ్ల అంతంత మాత్రం అమ్మకాల నుంచి ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్‌, టీవీ వంటి వినియోగదారుల ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాల కంపెనీలు  గత ఏడాది కోలుకున్నాయి. గత ఏడాది ఈ వస్తువుల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఈ జోష్‌తో ఈ ఏడాది అమ్మకాలు మరింత మెరుగ్గా ఉండగలవన్న ఆశలను కోవిడ్‌-19(కరోనా) వైరస్‌

Most from this category