News


బ్యాంకుల మెగా విలీనం ఆలస్యం..!

Sunday 23rd February 2020
news_main1582480644.png-32014

ప్రభుత్వరంగంలో మలివిడతగా జరగాల్సిన బ్యాంకుల మెగా విలీనం ఆలస్యమయ్యేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బ్యాంకుల విలీనం వల్ల ఒనగూరే ప్రయోజనాలు ఏ మేరకు.. ఎన్‌పీఏలు ఏ స్థాయిలో ఉంటాయి, నిధుల అవసరాలు ఏ మేరకు, రుణ వృద్ధి, వ్యయ నియంత్రణలు ఏ మేరకు, మూసివేయనున్న శాఖలు ఇత్యాది వివరాలను ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక శాఖను తాజాగా కోరింది. విలీనానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆయా బ్యాంకు బోర్డులు షేర్ల మార్పిడి నిష్పత్తిని ఖరారు చేయాల్సి ఉంటుంది. వాటికి వాటాదారుల ఆమోదం తీసుకుని, నియంత్రణ సంస్థల అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ, ఏప్రిల్‌ 1 నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుందా..? అన్నది సందేహంగా మారింది.  తాజా పరిణామాలను చూస్తుంటే ఏప్రిల్‌ ఒకటి నాటికి బ్యాంకుల విలీనం కార్యరూపం దాల్చకపోవచ్చని ఓ ప్రభుత్వరంగ బ్యాంకు సీనియర్‌ అధికారి తెలిపారు. 

 

నియంత్రణ సంస్థల ఆమోదమే కాదు, మార్చి 2 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాల్లో దీన్ని పార్లమెంట్‌ సభ్యుల పరిశీలనకు ఉంచాల్సి ఉంటుంది. పది ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేయాలని గతేడాది ఆగస్ట్‌లో ప్రభుత్వం నిర్ణయించిన విషయం గమనార్హం. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో యునైటెడ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌ విలీనం అవుతాయి. అలాగే, సిండికేట్‌ బ్యాంకు, కెనరా బ్యాంకు విలీనమవుతాయి. ఇండియన్‌ బ్యాంకులో అలహాబాద్‌ బ్యాంకు విలీనం అవుతుంది. యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు విలీనం కానున్నాయి.

 

ప్రభుత్వరంగంలో ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనం మొదటిది కాగా, రెండో విడతలో విజయాబ్యాంకు, దేనా బ్యాంకులు బ్యాంకు ఆఫ్‌ బరోడాలో విలీనమయ్యాయి. విజయ, దేనాలు బ్యాంకు ఆఫ్‌ బరోడాలో విలీనమైన పది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ బ్యాంకుల మధ్య టెక్నాలజీ అనుసంధానం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికితోడు మానవవనరుల సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇవన్నీ ఖాతాదారులకు అసౌకర్యంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వరంగ మెగా బ్యాంకుల విలీనం కార్యకలాపాల పరంగా అవరోధాలకు దారితీస్తుందని, రుణాల జారీపై ప్రభావం చూపిస్తుందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. బ్యాంకు యూనియన్లు కూడా వ్యతిరేకిస్తున్నాయి. You may be interested

ఐపీవోలో షేర్లు అలాట్‌ అవడం లేదా..?

Sunday 23rd February 2020

ఇటీవల వచ్చిన ఐఆర్‌సీటీసీ, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, సీఎస్‌బీ బ్యాంకు ఐపీవోలు ఎన్నో రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యాయి. ఎస్‌బీఐ ఐపీవో మార్చి 2న ప్రారంభం కానుంది. ఐపీవోలకు దరఖాస్తు చేసుకునే రిటైల్‌ ఇన్వెస్టర్లు సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. దీంతో రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటాకు డిమాండ్‌ పెరిగిపోయింది. ఫలితంగా అందరికీ షేర్లు అలాట్‌ అయ్యే పరిస్థితి ఉండడం లేదు. దీంతో అంతా మోసం అన్న

ఇక నిమిషాల్లో ఉచితంగా పాన్‌

Sunday 23rd February 2020

ఇప్పటి వరకు ఆదాయపన్ను శాశ్వతా ఖాతా నంబర్‌ (పాన్‌) తీసుకుని లేరా..? ఇప్పుడు పాన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా..? ఇకపై పాన్‌ నిమిషాల్లో తీసుకోవచ్చు. కాకపోతే ఆధార్‌ నంబర్‌ ఉండాలి. ఆధార్‌ నంబర్‌ సాయంతో ఇన్‌స్టంట్‌గా పాన్‌ను జారీ చేసే విధానాన్ని ఆదాయపన్ను శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో పేపర్లతో పని లేకుండా, ఎటువంటి చార్జీలు చెల్లించే పని లేకుండా, ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్‌గా పాన్‌ జారీ అయిపోతుంది.    ఆదాయన్ను శాఖకు చెందిన

Most from this category