News


ఏపీలో రూ.300 కోట్లతో మెడికవర్‌ విస్తరణ

Thursday 20th February 2020
news_main1582167249.png-31943

  • కంపెనీ పరమైన సింహపురి హాస్పిటల్స్‌
  • వైజాగ్‌, శ్రీకాకుళంలో కొత్తగా ఆసుపత్రులు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
వైద్య సేవల రంగంలో ఉన్న పోలాండ్‌కు చెందిన మెడికవర్‌ ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. తాజాగా నెల్లూరులోని సింహపురి ఆసుపత్రిని కొనుగోలు చేసింది. 250 పడకల సామర్థ్యమున్న ఈ కేంద్రం కోసం సంస్థ రూ.150 కోట్లదాకా వెచ్చించింది. దీనిని 750 పడకల స్థాయికి చేర్చనున్నారు. మెడికవర్‌గా పేరు మారిన ఈ ఆసుపత్రిని సంస్థ బుధవారం ఆవిష్కరించింది. ఇక్కడే క్యాన్సర్‌ చికిత్సకై రూ.30 కోట్ల వ్యయంతో 100 పడకల అత్యాధునిక ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించనున్నారు. ఇది సెప్టెంబరుకల్లా కార్యరూపంలోకి రానుందని మెడికవర్‌ సీఈవో ఫ్రెడ్రిక్‌ రాగ్‌మార్క్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక ప్రభుత్వంతోపాటు ఉత్సాహవంతుడైన ముఖ్యమంత్రి ఉన్నారంటూ ఆయన కితాబిచ్చారు. ఆంధప్రదేశ్‌లో తొలుత విస్తరణ చేపడతామని అన్నారు. తొలి దశలో ఏపీలో రూ.300 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారు.

ఇప్పటి వరకు రూ.700 కోట్లు...
యూరప్‌ హెల్త్‌కేర్‌ దిగ్గజం మెడికవర్‌కు ఇప్పటికే వైజాగ్‌లో రెండు ఆసుపత్రులు ఉన్నాయి. ఇక్కడ 200 పడకల హాస్పిటల్‌ను కొత్తగా ఏర్పాటు చేయనుంది. దీంతో వైజాగ్‌లో సంస్థ కేంద్రాల సంఖ్య మూడుకు చేరనుంది. అలాగే శ్రీకాకుళంలో 300 పడకలతో హాస్పిటల్‌ రానుంది. ప్రస్తుతం మెడికవర్‌కు పలు రాష్ట్రాల్లో ఉన్న అన్ని కేంద్రాల్లో కలిపి 2,500 పడకలు ఉన్నాయి. వైజాగ్‌, శ్రీకాకుళం కొత్త కేంద్రాల చేరికతో 3,000 పడకల స్థాయికి చేరనుంది. అనంతపూర్‌, కడపలోనూ మెడికవర్‌ సెంటర్లు రానున్నాయి. హైదరాబాద్‌లో 500 బెడ్స్‌గల ఓ ఆసుపత్రి కొనుగోలుకై చర్చలు జరుపుతున్నట్టు మెడికవర్‌ ఇండియా చైర్మన్‌ అనిల్‌ కృష్ణ వెల్లడించారు. భారత్‌లో మెడికవర్‌ ఇప్పటి వరకు రూ.700 కోట్లు వెచ్చించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెడికవర్‌ సీఎఫ్‌వో జో ర్యాన్‌, సీవోవో జాన్‌ స్టబ్బింగ్‌టన్‌ పాల్గొన్నారు.You may be interested

కోవిడ్‌ భయం... పసిడి పరుగు

Thursday 20th February 2020

అంతర్జాతీయంగా సరికొత్త గరిష్టస్థాయి ఔన్స్‌ 1,614 డాలర్లపైకి అప్‌ ఏడేళ్ల గరిష్ట స్థాయి న్యూయార్క్‌: చైనాలో మొదలై ప్రపంచాన్ని భయపెడుతున్న కోవిడ్‌-19 (కరోనా) వైరెస్‌... ఇన్వెస్టర్లను బంగారంవైపు తిరిగేలా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పెట్టుబడులకు బంగారమే సురక్షిత మార్గమని వారు భావిస్తున్నారు. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌- న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌- నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర బుధవారం ట్రేడింగ్‌ ఒక దశలో 1,614.25 డాలర్లను తాకింది. ఇది ఏడేళ్ల కనిష్టస్థాయి. ఈ

బొమ్మ బంపర్‌ హిట్‌..!

Thursday 20th February 2020

టికెట్ల అమ్మకాలు రయ్‌రయ్‌... గతేడాది 103 కోట్ల టికెట్లు సేల్‌ రూ.10,948 కోట్లు వెచ్చించిన సినీ ప్రియులు పైరసీతో సినీ రంగం నష్టపోతోందంటూ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. థియేటర్లకు వెళ్లి చూసే ప్రేక్షకుల సంఖ్యేమీ తగ్గడం లేదు. సినిమా కలెక్షన్లు అలవోకగా వందల కోట్లు దాటడమూ ఆగడం లేదు. ఆర్థిక వ్యవస్థలో మందగమనం భయాల్లాంటివి ఎలా ఉన్నా .. సినీ ప్రేమికులు రేటెంతైనా సరే టికెట్టు కొనుక్కుని చూసేందుకు మొగ్గుచూపుతున్నారని నివేదికలు

Most from this category