News


మందగమనంలోకి మీడియా!!

Wednesday 21st August 2019
news_main1566365033.png-27914

  • ఈసారి వృద్ధి 12 శాతానికే పరిమితమయ్యే అవకాశం
  • కేపీఎంజీ నివేదిక

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీడియా, వినోద రంగం వృద్ధి 12 శాతానికి మాత్రమే పరిమితం కావొచ్చని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఒక నివేదికలో వెల్లడించింది. డిజిటల్ యూజర్ల సంఖ్య, ప్రాంతీయ కంటెంట్‌కు డిమాండ్ గణనీయంగా పెరగడం తదితర అంశాల కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 13 శాతం వృద్ధి చెంది రూ. 1,63,100 కోట్లకు చేరింది. తాజాగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ జారీ చేసిన కొత్త టారిఫ్ ఆర్డర్ల వల్ల అనిశ్చితి తలెత్తడం, ఆర్థిక మందగమన సూచనలు గానీ లేకపోయిన పక్షంలో ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి మరో 1-2 శాతం ఎక్కువే నమోదయ్యేదని కేపీఎంజీ తెలిపింది. నియంత్రణ సంస్థ నిబంధనలపరంగా మరిన్ని మార్పులు, చేర్పులు జరగొచ్చన్న అంచనాల నేపథ్యంలో 2019-20లో మీడియా, వినోద పరిశ్రమ కేవలం 12 శాతం వృద్ధి చెంది రూ. 1.88 లక్షల కోట్లకు చేరవచ్చని పేర్కొంది. "ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు, క్రికెట్ వరల్డ్ కప్‌ సందర్భంగా ప్రకటనలపై భారీగా వ్యయాలు నమోదయ్యాయి. అవే గానీ లేకపోతే ఈ వృద్ధి మరింత తక్కువ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది" అని కేపీఎంజీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ట్రాయ్ టారిఫ్ ఆర్డరు ప్రభావం కోసం మార్కెటర్లు వేచి చూసే ధోరణిని ఎంచుకోవడంతో టీవీ విభాగం ఆదాయం కేవలం 9.5 శాతం మాత్రమే వృద్ధి చెందింది. నివేదికలోని మరిన్ని అంశాలు..
- 2018-19 నుంచి 2023-24 మధ్య కాలంలో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ 13 శాతం వార్షిక వృద్ధితో 2024 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3.07 లక్షల కోట్ల స్థాయికి చేరుతుంది. కొత్తగా వస్తున్న డిజిటల్ వ్యాపారాలు ఆదాయార్జనపై మరింతగా దృష్టి పెట్టడం, ప్రాంతీయ స్థాయిలో వ్యాపారావకాశాలు, నియంత్రణ సంస్థపరంగా సానుకూల పరిస్థితులు మొదలైనవి ఇందుకు దోహదపడనున్నాయి.
- టీవీ విభాగం ఏటా 11.2 శాతం వృద్ధితో 2024 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1,21,500 కోట్ల స్థాయికి చేరుతుంది. 
- ఇటు టీవీ, అటు ప్రింట్‌ మీడియాను కకావికలం చేస్తున్న డిజిటల్ మాధ్యమం.. టీవీ తర్వాత రెండో అతి పెద్ద విభాగంగా మారనుంది. 20 శాతం మార్కెట్ వాటా దక్కించుకోనుంది. 2022 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రకటనల ఆదాయాల్లో సింహభాగం డిజిటల్ మీడియాదే ఉండనుంది.You may be interested

టాప్‌ బ్రోకరేజ్‌ల లాంగ్‌టర్మ్‌ సిఫార్సులు

Wednesday 21st August 2019

దీర్ఘకాలానికి 22- 117 శాతం వరకు లాభాన్నిచ్చే ఆరు స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 1. ఐటీడీ సిమెంటేషన్‌: ఆనంద్‌రాఠీ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 103. అప్‌సైడ్‌ అంచనా- దాదాపు 49 శాతం. 2. జేబీఎం ఆటో: దోలత్‌ రిసెర్చ్‌ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 248. అప్‌సైడ్‌ అంచనా- 66 శాతం. 3. ఆయిల్‌ ఇండియా: కేఆర్‌ చౌక్సీ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 196. అప్‌సైడ్‌ అంచనా- 32

ఎన్‌సీఎల్‌టీలో డెలాయిట్‌కు దక్కని ఊరట

Wednesday 21st August 2019

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కేసులో చుక్కెదురు న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ కేసుకు సంబంధించి ఆడిటింగ్ సంస్థలు డెలాయిట్ హాస్కిన్స్‌ అండ్ సెల్స్‌, బీఎస్‌ఆర్‌ అసోసియేట్స్‌కు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో చుక్కెదురైంది. వాటిపై విధించిన నిషేధానికి సంబంధించి తాత్కాలికంగానైనా ఊరటనిచ్చేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ ఫ్రాడ్‌ కేసులో ముందస్తు షెడ్యూల్ ప్రకారం విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, సెప్టెంబర్ 20న జరిగే తదుపరి విచారణ దాకా తుది

Most from this category