మాస్టర్‌కార్డ్ కొత్త ఫీచర్
By Sakshi

న్యూఢిల్లీ: ఆన్లైన్ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగే దిశగా అంతర్జాతీయ పేమెంట్ సొల్యూషన్స్ దిగ్గజం మాస్టర్‌కార్డ్ తాజాగా కొత్త పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 'ఐడెంటిటీ చెక్ ఎక్స్‌ప్రెస్' పేరిట ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌తో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడంలో థర్డ్ పార్టీ వెబ్సైట్ అవసరం ఉండదని సంస్థ వెల్లడించింది. భారత్‌లో తొలిసారిగా నిర్వహించిన గ్లోబల్ మాస్టర్‌కార్డ్ సైబర్‌సెక్యూరిటీ సదస్సులో మాస్టర్‌కార్డ్ దీన్ని ఆవిష్కరించింది. సాధారణంగా 20 శాతం మొబైల్ ఈ-కామర్స్ లావాదేవీలు అవాంతరాల కారణంగా విఫలమవుతున్నాయని మాస్టర్‌కార్డ్ సైబర్ అండ్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ విభాగం ప్రెసిడెంట్ అజయ్ భల్లా తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజా ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్‌ల ద్వారా జరిపే చెల్లింపులకు కూడా ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు.
You may be interested
1.2 లక్షల స్టోర్లలో ‘పైన్‌ల్యాబ్స్’ క్రెడిట్, డెబిట్ ఈఎంఐ
Wednesday 7th August 2019హైదరాబాద్: మర్చంట్ ప్లాట్‌ఫామ్ కంపెనీ పైన్‌ల్యాబ్స్ క్రెడిట్, డెబిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని ఆరంభించింది. దేశ్యాప్తంగా 1,20,000 స్టోర్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్టు తెలిపింది. 90 రకాల బ్రాండ్లు, 19 బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలతో పైన్ ల్యాబ్స్ ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా కస్టమర్ల వద్దనున్న క్రెడిట్, డెబిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని ఆఫర్ చేస్తోంది. లక్షలాది కస్టమర్లకు డెబిట్, క్రెడిట్కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు
గోల్డ్ బాండ్ స్కీమ్ 9వ తేదీతో ముగింపు
Wednesday 7th August 2019న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సౌర్వభౌమ బంగారం బాండ్ల పథకంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో మూడో విడత పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. గ్రాముకు రూ.3,499గా ధర నిర్ణయించింది. సబ్స్క్రిప్షన్ ఈ నెల 5న ఆరంభం కాగా, ఈ నెల9వ తేదీన ముగుస్తుంది. ఆగస్టు 14వ తేదీన అర్హులైన వారికి బాండ్లను జారీ చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసి, డిజిటల్ పద్దతిలో చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ.50 వరకూ డిస్కౌంట్ ఇవ్వాలని