News


పెట్రోల్‌తో నడిచే విటార బ్రెజ్జా

Thursday 6th February 2020
news_main1580984787.png-31571ఆటోఎక్స్‌పో-2020లో విడుదల చేసిన మారుతీ సుజుకీ

గ్రేటర్‌ నోయిడా: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విటార బ్రెజ్జాను గురువారం ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసింది. ఈ కాంపాక్ట్‌ మోడల్‌లో బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్‌ ఉండడం విశేషం. కొత్త విటార బ్రెజ్జాలో 1.5 లీటర్ల సామర్ధ్యం గల పెట్రోల్‌  ఇంజిన్‌తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ పెట్రోల్‌ ఇంజిన్‌ అతితక్కువ ఉద్గారాలను వెలువరిస్తుందని కంపెనీ తెలిపింది. నెక్ట్స్ జనరేషన్‌ స్మార్ట్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీతో పాటు లిథియం అయాన్‌ బ్యాటరీ దీనిలో ఉంది. వెనుక, ముందు వచ్చే వాహనాలను సరిగ్గా గుర్తించగలిగే ఆటో రియాక్టింగ్‌ అవుట్‌ సైడ్‌ రియర్‌ వీవ్‌ మిర్రర్‌(ఓఆర్‌వీఎం), ఆటో డిమ్మింగ్‌ అండ్‌ యాంటీ గ్లేర్‌ ఇన్‌సైడ్‌రియర్‌ వీవ్‌ మిర్రర్‌(ఐఆర్‌వీఎం)తో పాటు గేర్‌ షిఫ్ట్‌ ఇండికేటర్‌లు దీనిలో ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్లలో.. డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్‌ విత్‌ ఈబీడీ, డ్రైవర్‌ తోపాటు పక్కసీటులో కూర్చునే వారికి బెల్ట్‌ పెట్టుకోమని చెప్పే రిమైండర్‌, రియర్‌ పార్కింగ్‌ అసిస్ట్‌, హై స్పీడ్‌ వార్నింగ్‌ అలర్ట్‌, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్‌లు ఉన్నాయి. 5-స్పీడ్‌ మాన్యూవల్‌, 4-స్పీడ్‌ ఆటోమాటిక్‌ ట్రాన్స్‌మిషన్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్రెజ్జా విడుదల సందర్భంగా మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెనిచీ ఆయుక్వా మాట్లాడుతూ.. డిజిల్‌తో నడిచే విటార బ్రెజ్జా 2016లో విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటిదాక 5 లక్షల వాహనాలను విక్రయించామని, తాజాగా విడుదల చేసిన విటార బ్రెజ్జా ఎస్‌యూవీ బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్‌ వాహనం కూడా వినియోగదారుల మనసులు దోచుకుంటుందని ఆయన అన్నారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న మారుతీ ఎరినా షోరూంలలో బుకింగ్స్‌ చేసుకోవచ్చని తెలిపారు. 


    
 You may be interested

అమెరికా దిగుమతులపై టారీఫ్‌లను తగ్గించిన చైనా

Thursday 6th February 2020

గత ఏడాది అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న 1,717 ఉత్పత్తులపై విధించే అదనపు సుంకాలను సగానికి తగ్గిస్తున్నట్లు చైనా గురువారం తెలిపింది. ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న తొలి దశ ఒప్పందంలో భాగంగా ఈ దిగుమతులపై సుంకాలను తగ్గించుకుంటున్న చైనా అధికారులు తెలిపారు. వాణిజ్య యుద్ధంలో భాగంగా... గతేడాది సెప్టెంబర్ 1 నుంచి అమెరికా దిగుమతులపై విధించిన సుంకాల తగ్గింపు ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి వస్తుందని చైనా ఆర్థిక మంత్రిత్వ

మార్కెట్లకు బ్యాంక్స్‌, ఫార్మా దన్ను

Thursday 6th February 2020

నాలుగో రోజూ మార్కెట్లు ప్లస్‌ సెన్సెక్స్‌ 163 పాయింట్లు అప్‌ 49 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ  ప్రపం‍చ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరివరకూ సానుకూలంగా కదిలాయి. వెరసి వరుసగా నాలుగో రోజు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 163 పాయింట్లు పెరిగి 41,306 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 49 పాయింట్లు పుంజుకుని 12,138 వద్ద ముగిసింది. అయితే ఇంట్రాడేలో మార్కెట్లు కొంతమేర ఒడిదొడుకులను చవిచూశాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 41,405 వద్ద

Most from this category