News


5 లక్షల బీఎస్‌-6 వాహనాల్ని విక్రయించాం-మారుతి

Wednesday 22nd January 2020
news_main1579689794.png-31106

మారుతీ 5 లక్షల బీఎస్‌-6 వాహనాల విక్రయం

 దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా 5 లక్షల బీఎస్‌-6 వాహనాలను విక్రయించినట్లు బుధవారం ప్రకటించింది. పెరిగిపోతున్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 ఇంజిన్‌ ఉన్న వాహనాలను మాత్రమే విక్రయించేలా నిబంధనలు తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనలు అమల్లోకి రాకముందే తాము 5 లక్షల బీఎస్‌-6 వాహనాలను విక్రయించామని మారుతీ సుజుకీ వెల్లడించింది. ఈ సందర్భంగా మారుతీ సుజుకీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో కెనిచీ అయుక్వా  మాట్లాడుతూ..మా ఈ విక్రయం భారత్‌లో కొత్త ఇంజిన్లు, సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధిని తెలుపుతుందని, పర్యావరణ పరిరక్షణ కొసం ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలకు తమ కంపెనీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని కెనిచీ అన్నారు.  కాగా ప్రభుత్వం బీఎస్‌-6 నిబంధనలు అమలుకు కల్పించిన గడువు కంటే ఏడాది ముందే 2019 ఏప్రిల్‌లో మారుతీ సుజుకీ తొలి బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్‌ కారును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆల్టో, ఎకో, ఎస్‌-ప్రెసో, సెలెరియో, వ్యాగ్నర్‌, స్విఫ్ట్‌, బాలెనో, డిజైర్‌, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌ -6 మోడళ్లను బీఎస్‌-6 ఇంజిన్లతో మారుతీ విక్రయిస్తోంది. 
 


 



You may be interested

6నెలల కాలానికి టాప్‌-4 రికమెండేషన్లు

Wednesday 22nd January 2020

బ్రోకరేజ్‌ సంస్థ: ఆనంద్‌ రాఠి షేరు పేరు: సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌  రేటింగ్‌: కొనవచ్చు ప్రస్తుత ధర: రూ.11.10 టార్గెట్‌ ధర: రూ.16.00 కాల వ్యవధి: 6నెలలు విశ్లేషణ: సెక్యూర్డ్‌ రీటైల్‌ ఎస్‌ఎంఈ పోర్ట్‌ఫోలియోల కారణంగా స్వల్పకాలంలో బ్యాంకు ఎన్‌ఐఎంలు ఫ్లాట్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఆస్తుల నాణ్యత స్థిరీకరణతో పాటు లోయర్‌ స్లిపేజ్‌లు వుంటాయని ఆనంద్‌ రాఠీ అంచనా వేస్తుంది.  బ్రోకరేజ్‌ సంస్థ: నిర్మల్‌ బంగ్‌ షేరు పేరు: కర్ణాటక బ్యాంక్‌ రేటింగ్‌: కొనవచ్చు ప్రస్తుత ధర: రూ.73.45 టార్గెట్‌ ధర: రూ.87.00 కాలవ్యవధి: 6నెలలు విశ్లేషణ: బ్యాంక్‌కు వున్న ఎన్‌బీఎఫ్‌సీ ఎక్స్‌పోజర్‌లో మంచి నాణ్యత కలిగిన కంపెనీలున్నాయి. బ్యాంక్ తన లక్ష్య పోర్ట్‌ఫోలియో మిశ్రమాన్ని

సెన్సెక్స్‌ 208 పాయింట్లు డౌన్‌

Wednesday 22nd January 2020

63 పాయిం‍ట్లు క్షీణించిన నిఫ్టీ బడ్జెట్‌పై అంచనాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనువెంటనే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చివరివరకూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో నష్టాలతో ముగిశాయియి. సెన్సెక్స్‌ 208 పాయింట్లు కోల్పోయి 41,115 వద్ద నిలవగా.. నిఫ్టీ 63 పాయింట్లు క్షీణించి 12,107 వద్ద స్థిరపడింది. అయితే ట్రేడింగ్‌ ప్రారంభంలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 42,532 వద్ద సెన్సెక్స్‌, 12,225 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. తదుపరి

Most from this category