News


తగ్గిన మారుతి అమ్మకాలు

Monday 1st July 2019
Markets_main1561969936.png-26715

మారుతి సుజుకీ ఇండియా(ఎమ్‌ఎస్‌ఐ) జూన్‌ నెల అమ్మకాలు 14 శాతం మేర తగ్గాయి. గత ఏడాది జూన్‌లో 1,44,981 యూనిట్ల అమ్మకాలు జరగగా ఈ ఏడాది జూన్‌లో 1,24,708 యూనిట్లు అమ్మకాలు జరిగాయని సోమవారం విడుదల చేసిన నివేదికలో కంపెనీ పేర్కొంది. దేశియ అమ్మకాలు 15.3 శాతం తగ్గి 1,35,662 యూనిట్ల నుంచి 1,14,861 యూనిట్లకు పడిపోయాయి. మిని సెగ్మెంట్‌లో  కాంప్రైజింగ్‌ ఆల్టో, ఓల్డ్‌ వ్యాగన్‌ ఆర్‌ల అమ్మకాలు 36.2 శాతం తగ్గి 29,381 యూనిట్లు నుంచి 18,733 యూనిట్లకు, కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లో న్యూ వ్యాగన్‌ ఆర్‌, సెలార్యో, ఇగ్నీస్‌, స్విఫ్ట్‌, బాలెనో, డిజైర్‌ అమ్మకాలు 12.1 శాతం తగ్గి 71, 570 నుంచి  62,897 యూనిట్లకు పడిపోయాయి. 
    మిడ్‌ సెగ్మంట్‌లో సియాజ్‌ అమ్మకాలు  47.1శాతం వృద్ధితో 1,579 యూనిట్లు నుంచి 2,322యూనిట్లుకు పెరిగాయి. యుటిలిటి వాహనాలైన జిప్సీ, ఎర్టిగా, విటారా బ్రెజ్జా, ఎస్‌ క్రాస్‌ అమ్మకాలు 7.9 శాతం తగ్గి 19,321 యూనిట్లు నుంచి 17,797 యూనిట్లకు, వ్యాన్‌ సెగ్మెంట్‌లో కాంప్రైజింగ్‌ ఓమ్నీ, ఎకో మోడళ్ల అమ్మకాలు 24 శాతం తగ్గి 12,185 యూనిట్లు నుంచి 9,265 యూనిట్లకు పడిపోయాయి. లైట్‌ కమర్షియల్‌ వెహికిల్‌ అమ్మకాలు మాత్రం 24 శాతం వృద్ధితో 1,626 యూనిట్లు నుంచి 2,017​‍ యూనిట్లకు పెరిగాయి.  ఎమ్‌ఎస్‌ఐ ఎగుమతులు 5.7 శాతం మేర పెరిగాయి. గత ఏడాది జూన్‌లో 9,319 యూనిట్లు ఎగుమతులు జరగగా ఈ ఏడాది జూన్‌లో అవి 9,847 యూనిట్లుగా ఉన్నాయి. 
  సోమవారం మధ్యాహ్నాం 2.13 సమయానికి మారుతి సుజుకి షేరు విలువ 0.17 శాతం నష్టపోయి రూ 6,524 వద్ద ట్రేడవుతోంది.


 



You may be interested

షార్ట్‌టర్మ్‌ కోసం ఐదు సిఫార్సులు

Monday 1st July 2019

స్వల్పకాలంలో 20 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను అనలిస్టులు సిఫార్సు చేస్తున్నారు. 1. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 145. స్టాప్‌లాస్‌ రూ. 104. గత గరిష్ఠాల నుంచి పతనమైన తర్వాత రూ. 115 వద్ద బాటమ్‌ అవుట్‌ అయింది. చార్టుల్లో బుల్లిష్‌ పాటర్న్‌ కనిపిస్తోంది. 2. పీఎన్‌బీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 89. స్టాప్‌లాస్‌ రూ. 74. కీలకమైన రూ.73 స్థాయినుంచి రీబౌండ్‌ చూపింది. చార్టుల్లో మార్నింగ్‌స్టార్‌

హెచ్‌డీఎఫ్‌సీ...ఆల్‌టైమ్‌ హై

Monday 1st July 2019

ప్రైవేట్‌ రంగ దిగ్గజ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు సోమవారం ఎన్‌ఎస్‌ఈలో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో దాదాపు 2.20శాతం ర్యాలీ చేసి రూ.2240.00ల స్థాయిని అందుకున్నాయి. ఈ ధర(రూ.2240.00) షేరుకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.1:20నిల.కు షేరు గతముగింపు(రూ.2,192.10)తో పోలిస్తే 2.18శాతం లాభపడి రూ. 2,239.95ల వద్ద ట్రేడ్‌  అవుతోంది. ఇండెక్స్‌లో అధిక

Most from this category