News


పెరిగిన మారుతీ సుజుకీ ఉత్పత్తి

Monday 9th December 2019
news_main1575860509.png-30118

  •  నవంబర్‌లో 4 శాతం అప్‌

న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. నవంబర్‌లో వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,41,834 యూనిట్లుగా నమోదైనట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అంతక్రితం ఏడాది నవంబర్‌లోని 1,35,946 యూనిట్లతో పోల్చితే ఈసారి ఉత్పత్తి 4.33 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. ప్రయాణికుల వాహనాల ఉత్పత్తి గతనెల్లో 1,39,084 యూనిట్లు కాగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలోని 1,34,149 యూనిట్లతో పోల్చితే 3.67 శాతం వృద్ధి ఉందని వివరించింది. అక్టోబర్‌ నెల కార్ల ఉత్పత్తిలో 20.7 శాతం కోతను విధించి 1,19,337 యూనిట్లకే పరిమితం చేసిన సంస్థ.. గతనెల్లో పెంపును ప్రకటించింది. 



You may be interested

ఈసారి 5 శాతం లోపే వృద్ధి

Monday 9th December 2019

ఐహెచ్‌ఎస్ మార్కిట్ నివేదిక న్యూఢిల్లీ: ఉద్దీపన చర్యల ప్రభావం పూర్తి స్థాయిలో ప్రతిఫలించడానికి మరింత సమయం పట్టేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతానికన్నా కాస్త తక్కువగానే ఉండవచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఒక నివేదికలో పేర్కొంది. బలహీన ఆర్థిక రంగ పరిస్థితులు.. భారత వృద్ధి వేగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని తెలిపింది. మొండిబాకీల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 9th December 2019

యాక్సిస్‌ బ్యాంక్‌ -  కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.718 టార్గెట్‌ ధర: రూ.870 ఎందుకంటే: రుణాల పరంగా చూస్తే, దేశంలో అతి పెద్ద మూడవ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇది. ఈ బ్యాంక్‌ 4,284 బ్రాంచ్‌లు, 12,191 ఏటీఎంలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అన్ని రకాలైన రుణాలను ఈ బ్యాంక్‌ అందిస్తోంది. భారీ, మధ్య తరహా కంపెనీలకే కాకుండా లఘు, చిన్న తరహా వాణిజ్య సంస్థలకు, వ్యవసాయ, రిటైల్‌ రుణాలను కూడా ఇస్తోంది.

Most from this category