News


మారుతీ సుజుకీ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Monday 27th January 2020
news_main1580120180.png-31241

బ్రోకరేజ్‌ల అంచనాలు
డిసెంబర్‌ త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా రెండంకెల లాభాల వృద్ధి ప్రకటించవచ్చని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. అల్ప బేస్‌ ‍ప్రభావం, వాల్యూంల స్థిరీకరణతో లాభాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నాయి. సరాసరి అమ్మక ధరల పెరుగుదల కంపెనీ ఆదాయాలను పెంచవచ్చని భావిస్తున్నాయి. మంగళవారం మారుతీ తన క్యు3 ఫలితాలు ప్రకటించనుంది. డిమాండ్‌ అవుట్‌లుక్‌పై అంచనాలు, పండుగ సీజన్‌ అనంతర ట్రెండ్స్‌ తదితరాలను ఫలితాల సందర్భంగా నిశితంగా పరిశీలించాలని అనలిస్టులు చెబుతున్నారు. ఎకానమీలో డిమాండ్‌ క్రమంగా పెరగడంతో ఓఈఎంలవారీగా వాల్యూం డౌన్‌ట్రెండ్‌కు అడ్డుకట్ట పడవచ్చని భావిస్తున్నారు. ఆటో కంపెనీల ఇన్వెంటరీ కరెక‌్షన్‌ పూర్తికావడం కూడా ప్రభావం చూపవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. మారుతీ లాభంలో 14.3 శాతం పెరుగుదల, ఆపరేటింగ్‌ రెవెన్యూలో 11.1 శాతం వృద్ధి ఉంటాయని అంచాన వేసింది. గతేడాది క్యు3తో పోలిస్తే మారుతీ ఎబిటా 33 శాతం పెరగవచ్చని కోటక్‌ ఈక్విటీస్‌ అభిప్రాయపడింది. వాల్యూంల పెరుగుదల, అధిక ఏఎస్‌పీల కారణంగా రెవెన్యూలో 16 శాతం పెరుగుదల ఉండొచ్చని తెలిపింది. ఇదే సమయంలో నికరలాభం 17.3 శాతం మేర దూసుకుపోయి రూ. 1746 కోట్లను చేరవచ్చని అంచనా వేసింది. విక్రయాల్లో వృద్ధి 15.5 శాతం మేర ఉండొచ్చని పేర్కొంది. బీఎస్‌6 నిబంధనల అమలు కారణంగా ధరలు పెరగడం కలిసివస్తుందని తెలిపింది. మారుతీ లాభం 12.7 శాతం, విక్రయాలు 13 శాతం చొప్పున పెరగవచ్చని షేర్‌ఖాన్‌ అంచనా వేసింది. 



You may be interested

ఎయిరిండియా వాటా విక్రయానికి సిద్ధమైన కేంద్రం

Monday 27th January 2020

తీవ్ర నష్టాలతో సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను అమ్మేందుకు కేంద్రం సిద్ధమైంది. సంస్థలో 100శాతం వాటా విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వం సోమవారం ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానించింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుని బిడ్లను ఆహ్వానించింది. ఎయిర్‌లైన్‌ వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని భావిస్తుండటంతో కొనుగోలుదారులు లేవనెత్తే డిమాండ్లను అంగీకరించి విక్రయ ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బిడ్డింగ్‌ ప్రక్రియలో భాగంగా కాంట్రాక్టులకు సంబంధించిన

ఈ చిన్న షేర్లు.. ఫండ్స్‌ ఫేవరెట్స్‌

Monday 27th January 2020

క్యూ3లో మ్యూచువల్‌ ఫండ్స్‌ షాపింగ్‌ జాబితాలో నారాయణ, ఎఫ్‌డీసీ, ఇప్కా మిధానీ, జూబిలెంట్‌ ఫుడ్‌, ఫీనిక్స్‌ మిల్స్‌ ఇటీవల ర్యాలీలో ఈ స్మాల్‌ క్యాప్స్‌ జోరు ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో క్వార్టర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు మక్కువ చూపిన కంపెనీలు గత కొంతకాలంగా జోరు చూపుతున్నాయి. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఫండ్‌ హకౌస్‌లు కనీసం 1 శాతం వాటాను సొంతం చేసుకున్న కొన్ని చిన్న, మధ్యతరహా కంపెనీల కౌంటర్లు ఇదే కాలంలో ర్యాలీ బాటలో సాగుతూ వచ్చాయి.

Most from this category