STOCKS

News


మారుతీ లాభం రూ.1,587 కోట్లు

Wednesday 29th January 2020
news_main1580272952.png-31288

(అప్‌డేటెడ్‌...)

  • 4 శాతం వృద్ధి 
  • రూ.20,722 కోట్లకు ఆదాయం 
  • 2 శాతం పెరిగిన వాహన విక్రయాలు

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో ​‍తైమాసిక కాలంలో 4 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,525 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,587 కోట్లకు పెరిగిందని మారుతీ సుజుకీ తెలియజేసింది. సేల్స్‌ ప్రమోషన్‌ వ్యయాలు అధికంగా ఉండటం, అధిక తరుగుదల, పెట్టుబడులపై వచ్చిన లాభాలు తక్కువగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొంది. అయినప్పటికీ, కమోడిటీ ధరలు తక్కువగా ఉండటం, కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గడం, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా నికర లాభం పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.19,681 కోట్ల నుంచి రూ.20,722 కోట్లకు పెరిగింది.  
9 నెలల్లో లాభం 25 శాతం డౌన్‌....
ఈ క్యూ3లో వాహన విక్రయాలు 2 శాతం వృద్ధితో 4.37 లక్షలకు పెరిగాయి. దేశీయ అమ్మకాలు 2 శాతం పెరగ్గా, 23,663 వాహనాలను ఎగుమతి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నికర లాభం(కన్సాలిడేటెడ్‌) 25 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి రూ.5,820 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.4,355 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.64,594 కోట్ల నుంచి 11 శాతం పతనమై రూ.57,452 కోట్లకు తగ్గింది. వాహన విక్రయాలు 16 శాతం క్షీణించి 11,78,272కు తగ్గాయి. దేశీయ అమ్మకాలు 17 శాతం పతనమయ్యాయి. 



You may be interested

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆదాయం రూ.7,308 కోట్లు

Wednesday 29th January 2020

 రూ.164 కోట్ల నికర లాభం  స్వల్పంగా తగ్గిన మొండి బకాయిల ప్రభావం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రూ.164 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.681 కోట్ల నికర నష్టాలొచ్చాయని బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,356 కోట్ల నుంచి రూ.7,308 కోట్లకు పెరిగింది. తగ్గిన మొండి భారం... మొండి బకాయిలు స్వల్పంగా తగ్గాయి. గత

మహీంద్రా ఫైనాన్స్‌ లాభం రూ.475 కోట్లు

Wednesday 29th January 2020

16 శాతం వృద్ధి  14 శాతం పెరిగి రూ.3,081 కోట్లకు ఆదాయం న్యూఢిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.475 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆర్జించిన నికర లాభం, రూ.409 కోట్లుతో పోల్చితే 16 శాతం వృద్ధి సాధించామని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తెలిపింది. ఆదాయం రూ.2,705 కోట్ల నుంచి 14

Most from this category