News


మారుతీ సుజుకీ లాభంలో 39 శాతం క్షీణత

Thursday 24th October 2019
news_main1571906409.png-29111

సెప్టెంబర్‌ త్రైమాసికానికి మారుతీ సుజుకీ రూ. 1358.60 కోట్ల నికరలాభం ప్రకటించింది. గతేడాది క్యు2తో పోలిస్తే ఇది 39.35 శాతం తక్కువ. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 2240 కోట్ల లాభం నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ తక్కువ లాభం నమోదు చేసినా, అనలిస్టుల అంచనాలను మాత్రం దాటేసింది. అనలిస్టుల్లో ఎక్కువమంది కంపెనీ రూ. 950 కోట్ల లాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. తాజా సమీక్షా కాలంలో కంపెనీ నికర విక్రయాలు 22.5 శాతం క్షీణించి రూ. 16120 కోట్లను చేరాయి. విక్రయ వాల్యూంలు 30.2 శాతం పతనమై 3.38 లక్షల యూనిట్లను చేరాయి. కంపెనీ ఆపరేటింగ్‌ ఎబిటా బాగా దెబ్బతిని దాదాపు 75 శాతం పతనమై రూ. 680 కోట్లకే పరిమితమయింది. 
ఫలితాలు క్లుప్తంగా..

ఈ ఏడాది పలు కారణాలు ఆటో అమ్మకాలపై నెగిటివ్‌ ప్రభావం చూపాయని కంపెనీ వ్యాఖ్యానించింది. ముఖ్యంగా రక్షణ, ఉద్గార నియమాలు కఠినతరం చేయడంతో కారు కొనాలనే వాళ్ల సంఖ్య తగ్గిందని తెలిపింది. వాహన బీమా వ్యయాలు పెరగడం, పలు రాష్ట్రాల్లో రోడ్డు టాక్సుల పెంపు కూడా అమ్మకాలను కుంగదీశాయి. మరోవైపు వ్యవస్థలో లిక్విడిటీ తగ్గడం, రుణాల కేటాయింపు మందగించడంతో కస్టమర్లు కొత్త కొనుగోళ్లకు పెద్దగా మొగ్గుచూపలేదని తెలిపింది. గురువారం మధ్యాహ్న సమయానికి మారుతీ షేరు దాదాపు రూ.90 నష్టంతో రూ.7350 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

11550 కోల్పోతే 11400పాయింట్లకు నిఫ్టీ?!

Thursday 24th October 2019

నిపుణుల అంచనా నిఫ్టీ చార్టుల్లో సందిగ్దతకు నిదర్శనమైన డోజీ క్యాండిల్‌ ఏర్పడింది. ప్రస్తుతం నిఫ్టీకి 11700 పాయింట్ల వద్ద గట్టి నిరోధం ఎదురవుతోంది. ఈ స్థాయిని దాటితేనే మరింత అప్‌మూవ్‌ వచ్చి క్రమంగా 12100 పాయింట్ల వరకు నిఫ్టీ ఎగబాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నిఫ్టీలో బలహీనత పెరిగి 11550 పాయింట్ల కీలక మద్దతు కోల్పోతే క్రమంగా 11450- 11400 పాయింట్ల వరకు దిగజారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ

ఎల్‌అండ్‌టీ ...బ్రోకరేజ్‌లు పాజిటివ్‌

Thursday 24th October 2019

రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అధిగమించడంతో ఎల్‌అండ్‌టీ షేర్లు గురువారం బీఎస్‌ఈల ట్రేడింగ్‌లో 2.50శాతం పెరిగి రూ.1466.00 స్థాయిని తాకాయి. ఆశాజనక ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో ఎల్‌ అండ్‌ టీ షేర్లపై పలు బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేర్లకు టార్గెట్‌ ధరను పెంచాయి. మధ్యాహ్నం గం.1:20లకు షేరు క్రితం​ముగింపు(రూ.1430.95)తో పోలిస్తే 1శాతం లాభంతో రూ.1430.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నోమురా బ్రోకరేజ్‌  రేటింగ్‌:- కొనవచ్చు టార్గెట్‌ ధర:- రూ.1,725

Most from this category