News


పెరిగిన మారుతి సుజుకీ అక్టోబర్‌ అమ్మకాలు

Friday 1st November 2019
news_main1572596460.png-29287

మారుతి సుజుకీ అక్టోబర్‌ అమ్మకాలు మార్కెట్‌ అంచనాలకు తగ్గట్టుగానే అక్టోబర్‌లో అమ్మకాలు పెరిగాయి. పండుగ సీజన్‌ సందర్భంగా వాహన విక్రయాలు పెరగడంతో మెరుగైన అమ్మకాల గణాంకాలను నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. వార్షిక ప్రాతిపాదికన అక్టోబర్‌లో మొత్తం అమ్మకాలు 4.5శాతం పెరిగాయి. ఈ అక్టోబర్‌లో మొత్తం 153435 వాహనాల విక్రయం జరగ్గా, గతేడాది ఇదే అక్టోబర్‌లో మొత్తం 1,46,766 వాహనాలు అమ్ముడయ్యాయి. దేశీయ అమ్మకాలు 1,44,277 యూనిట్లు నమోదు కాగా, కిందటేడాది ఇదే అక్టోబర్‌లో విక్రయించిన 1,38,100 యూనిట్లు పోలిస్తే ఇది 4.5శాతం అధికం. ఇదే నెలలో ఎగుమతులు 5.7శాతంగా వృద్ధిని సాధించాయి. ఈ అక్టోబర్‌లో 9,158 వాహనాలు విదేశాలకు ఎగుమతికాగా, గతేడాది ఇదే అక్టోబర్‌లో 8,666 యూనిట్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి.  

చిన్న కార్ల విభాగంలోని అల్టో, వేగనార్‌, కొత్త మార్కెట్లో విడుదలైన ఎస్‌-ప్రెసో అమ్మకాలు 13.1శాతం క్షీణించాయి. గతేడాది ఈ విభాగపు అమ్మకాలు 32,835 యూనిట్లుగా నమోదు కాగా, ఈ ఏడాది ఈ అక్టోబర్‌లో 28,537 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇదే అక్టోబర్‌లో కాంపాక్ట్‌ విభాగంలోని ప్రధాన మోడల్స్‌ సిఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ అమ్మకాలు 75,094 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే అక్టోబర్‌ నమోదైన మొత్తం​64,789 అమ్మకాలతో పోలిస్తే ఇది 15.9శాతం అధికం. 

మిడ్‌సెజ్‌ విభాగానికి చెందిన సీడెన్‌ సియాజ్‌ అమ్మకాలు తగ్గాయి. కిందటేడాది అక్టోబర్‌లో మొత్తం 3,892 అమ్మకాలు జరగ్గా, ఈ అక్టోబర్‌లో 2,371 యూనిట్లు మాత్రమే అమ్మడయ్యాయి. అంటే మొత్తంగా 39.1శాతం తగ్గుముఖం పట్టాయి.

యూలిటిటీ మోడల్స్‌ విభాగంలోని విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగా వాహన విక్రయాలు అక్టోబర్‌లో 23,108 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 20,764 వాహనాలు అమ్ముడుబోయాయి. 

అక్టోబర్‌ అమ్మకాలు ఆశించిన నమోదుకావడంతో మారుతి సుజుకీ ఇండియా షేర్లు మిడ్‌సెషన్‌ సమయానికి అరశాతం లాభంతో రూ.7610.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

క్షీణించిన బజాజ్‌, అశోక్‌ లేలాండ్‌ అమ్మకాలు

Friday 1st November 2019

9శాతం క్షీణించిన బజాజ్‌ అమ్మకాలు:- వార్షిక ప్రాతిపదికన బజాజ్‌ అమ్మకాలు అక్టోబర్‌లో 9శాతం క్షీణించాయి. ఈ అక్టోబర్‌ నెలలో మొత్తం 4,63,208 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో మొత్తం 5,06,699 వాహనాలు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అక్టోబర్‌లో దేశీయ అమ్మకాలు 2.78లక్షలు నమోదు కాగా గతేడాది ఇదే అక్టోబర్‌లో నమోదైన మొత్తం 3.20లక్షల అమ్మకాలతో పోలిస్తే ఇది 13శాతం తక్కువ. మోటర్‌ సైకిల్‌ విభాగపు అమ్మకాలు సైతం 14శాతం

3ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం

Friday 1st November 2019

నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 3ఏళ్ల గరిష్టానికి చేరింది. ఈ అక్టోబర్‌లో నిరుద్యోగిత రేటు 8.50శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఇందుకు కారణమైనట్లు సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్‌లో నిరుద్యోగిత రేటు 7.2శాతంగా ఉంది. ఇదే సెప్టెంబర్‌లో మౌలికరంగంలో 5.2శాతం క్షీణించింది. దశాబ్ధ కాలంలో ఇదే అత్యంత క్షీణత కావడం గమనార్హం. ఎనిమిది మౌలిక రంగాల్లో ఏడు ప్రతికూల వృద్ధిని

Most from this category