News


మారుతీ సుజుకీ ఉత్పత్తిలో కోత

Monday 11th November 2019
news_main1573442796.png-29488

  • అక్టోబర్‌లో 20.7 శాతం తగ్గింపు

న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. అక్టోబర్‌ నెల కార్ల ఉత్పత్తిలో 20.7 శాతం కోతను విధించింది. గతనెల్లో 1,19,337 యూనిట్లకే పరిమితమైంది. అంతక్రితం ఏడాది అక్టోబర్‌లో 1,50,497 యూనిట్లను సంస్థ ఉత్పత్తి చేసింది. ఏడాది ప్రాతిపదికన భారీ ఉత్పత్తి కోతను విధించి వరుసగా 9వ నెల్లోనూ అవుట్‌పుట్‌ను తగ్గించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ప్యాసింజర్‌ వాహన ఉత్పత్తి 20.85 శాతం తగ్గింది. You may be interested

రిలయన్స్ గ్యాస్ రేటు తగ్గింపు

Monday 11th November 2019

న్యూఢిల్లీ: కొనుగోలుదారుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో కేజీ-డీ6 బ్లాక్‌లో కొత్తగా ఉత్పత్తి చేయబోయే గ్యాస్ బేస్ ధరను రిలయన్స్ ఇండస్ట్రీస్‌ 7 శాతం తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేజీ-డీ6 బ్లాక్‌లోని ఆర్‌-క్లస్టర్ క్షేత్రం నుంచి కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్‌ కొనుగోలు కోసం రిలయన్స్ బిడ్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. బిడ్డింగ్ నిబంధనల ప్రకారం.. గడిచిన మూడు నెలల బ్రెంట్ క్రూడ్‌ సగటు రేటులో 9 శాతం స్థాయిలో

ఈసారి 'దావోస్‌'కు భారీ సన్నాహాలు

Monday 11th November 2019

జనవరిలో డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు భారత్ నుంచి 100 మంది పైగా సీఈవోలు,  రాజకీయ నేతలు, బాలీవుడ్ స్టార్స్‌ న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సదస్సు కోసం భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ఈ సదస్సులో భారత్ నుంచి 100 మంది పైగా సీఈవోలు, పలువురు రాజకీయ నేతలు, దీపికా పదుకునె వంటి బాలీవుడ్ స్టార్స్

Most from this category