News


మారుతీ కార్ల ధరలు పెరిగాయ్‌

Tuesday 28th January 2020
news_main1580179926.png-31246

  • మోడల్‌ ఆధారంగా రూ. 10,000 వరకు పెంపు

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వాహన ధరలను పెంచినట్లు సోమవారం ప్రకటించింది. మోడల్‌ ఆధారంగా రూ. 10,000 వరకు పెంచింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించడంలో భాగంగా పలు మోడళ్ల ధరలను పెంచుతున్నామని, ఈ పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. గరిష్టంగా 4.7 వరకు పెంపు ఉన్నట్లు వెల్లడించింది. 

పెరిగిన కార్ల జాబితా...
- ఎంట్రీ లెవిల్ మోడల్ ఆల్టో ధర రూ. 9,000-6,000 శ్రేణిలో పెరిగింది. ఎస్‌-ప్రెసో ధర రూ. 1,500 నుంచి రూ. 8,000 వరకు పెరిగినట్లు తెలిపింది. వ్యాగన్‌ఆర్‌ ధర రూ. 1,500 నుంచి రూ. 4,000 వరకు పెరిగింది. మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా ధరలో పెంపు రూ. 4,000-10,000 శ్రేణిలో ఉంది. బాలెనో ధర పెంపు రూ. 3,000 నుంచి రూ. 8,000 వరకు ఉండగా.. ప్రీమియం మల్టీ పర్పస్ వెహికల్ ఎక్స్‌ఎల్‌6 ధర రూ. 5,000 పెరిగింది. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.4,196 కోట్లు

Tuesday 28th January 2020

24 శాతం వృద్ధి  5 లక్షల కోట్లకు ఎగసిన రుణాలు  నాలుగు రెట్లు ఎగసిన స్టాండ్‌అలోన్‌ లాభం  న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 24 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.3,377 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.4,196 కోట్లకు పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.24,653 కోట్ల నుంచి రూ.29,073 కోట్లకు పెరిగిందని కంపెనీ వైస్‌

ఎయిరిండియా విక్రయం.. టేకాఫ్‌

Tuesday 28th January 2020

(అప్‌డేటెడ్‌...) 100 శాతం వాటా అమ్మకానికి సై... బిడ్డింగ్‌ పత్రాన్ని విడుదలచేసిన కేంద్రం ఆసక్తి వ్యక్తీకరణకు మార్చి 17 డెడ్‌లైన్‌... రూ.23,287 కోట్ల అప్పు భరించాల్సిందే.. బిడ్డింగ్‌ నిబంధనల్లోనూ పలు మార్పులు న్యూఢిల్లీ: తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయి... ఎగరడానికి ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాను పూర్తిగా వదిలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంస్థలోని మొత్తం 100 శాతం వాటాను వ్యూహాత్మక విక్రయం ద్వారా అమ్మేయాలని నిర్ణయించింది. బిడ్డింగ్‌ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక విధివిధానాలను సోమవారం విడుదల చేసింది.

Most from this category