News


మారుతీ కార్ల ధరలు తగ్గాయ్‌

Thursday 26th September 2019
news_main1569470329.png-28554

  • రూ.5,000 వరకూ తగ్గింపు 
  • బజాజ్‌ తగ్గింపు రూ.6,000 వరకూ 

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ తన  కార్ల ధరలను తగ్గించింది. ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను రూ.5,000 వరకూ తగ్గించామని మారుతీ సుజుకీ తెలిపింది. ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్‌ డీజిల్‌ సెలెరియో, బాలెనో డీజిల్‌, ఇగ్నిస్‌, డిజైర్‌ డీజిల్‌, టూర్‌ ఎస్‌ డీజిల్‌, విటారా బ్రెజా, ఎస్‌-క్రాస్‌ మోడళ్ల ధరలను తక్షణం తగ్గిస్తున్నామని పేర్కొంది. ఈ కార్ల ధరలు రూ.2.93 లక్షల నుంచి రూ.11.49 లక్షల రేంజ్‌లో ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం ఇస్తున్న డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లకు ఈ తగ్గింపు అదనమని పేర్కొంది. ఈ తగ్గింపు కారణంగా ఎంట్రీ లెవల్‌ కార్ల ధరలు తగ్గుతాయని, ఫలితంగా అమ్మకాలు పుంజుకోగలవని తెలిపింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు కారణంగా ధరలను తగ్గిస్తున్నామని మారుతీ సుజుకీ వెల్లడించింది. 
బజాజ్‌ తగ్గింపు రూ.6,000 వరకూ...
మరోవైపు పండగ ఆఫర్లలో భాగంగా బజాజ్‌ ఆటో కంపెనీ తమ బైక్‌లపై ధరలను రూ.6,000 వరకూ తగ్గించింది. ఐదు ఉచిత సర్వీస్‌లను, ఐదేళ్ల వారంటీని ఆఫర్‌ చేస్తోంది. ఈ ఆఫర్లు వచ్చే నెల 8 వరకూ ఉంటాయని బజాజ్‌ ఆటో తెలిపింది. సీటీ110, ప్లాటినా, పల్సర్‌ 150, పల్సర్‌ 220 ఎఫ్‌, డామినర్‌ 400, అవెంజర్‌, వి, డిస్కర్‌ బైక్‌లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. వెస్పా, అప్రిలియా వాహనాలపై రూ.10,000 వరకూ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నామని పియాజియో కంపెనీ తెలిపింది. 



You may be interested

భారత్‌... అవకాశాల గని!

Thursday 26th September 2019

ఇదో బంగారు అవకాశం బ్లూంబర్గ్‌ బిజినెస్‌ ఫోరంలో ‍ప్రధాని మోదీ పిలుపు కార్పొరేట్‌ పన్నుతగ్గించాం..  మరిన్ని చర్యలు ఉంటాయని హామీ న్యూయార్క్‌: అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్‌ స్వర్గధామంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దీర్ఘకాల ప్రయాణంలో కేవలం ఆరంభమేనన్నారు. కార్పొరేట్‌ పన్నును చరిత్రాత్మక స్థాయిలో ప్రభుత్వం తగ్గించిందని, పెట్టుబడులకు ఇదొక బంగారం లాంటి అవకాశమని అభివర్ణించారు. భారత్‌లో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని న్యూయార్క్‌లో బుధవారం జరిగిన

71.02 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Thursday 26th September 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం ప్లాట్‌గా 71.02 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినప్పటికి, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడంతో రూపీ డాలర్‌ మారకంలో 3 పైసలు బలహీనపడి 7.03 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు ప్రతికూలంగా కదులుతుండడం, యుఎస్‌లో రాజీకీయ అనిశ్చితి, విదేశీ నిధుల ఔట్‌ఫ్లో కొనసాగుతుండడం వంటి కారణాలు రూపీ పై ప్రభావం చూపుతున్నాయని ఫారెక్స్‌ ట్రేడర్స్‌

Most from this category