News


పండుగల సీజన్‌లో ‘మారుతీ’ బంపర్‌ ఆఫర్‌

Saturday 28th September 2019
news_main1569646023.png-28596

  • బాలెనో మోడల్‌ కారుపై రూ. లక్ష తగ్గింపు

న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) తాజాగా మరో విడత భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పండుగల సీజన్‌లో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. తాజాగా తన బాలెనో మోడల్‌ కారు ధరను రూ. 1,00,000 తగ్గించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈనెల 25న (బుధవారం) ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను రూ.5,000 వరకూ తగ్గించామని మారుతీ సుజుకీ ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఇందుకు అదనంగా తాజా తగ్గింపు ఉంటుందని శుక్రవారం ప్రకటించింది. ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్‌ డీజిల్‌ సెలెరియో, బాలెనో డీజిల్‌, ఇగ్నిస్‌, డిజైర్‌ డీజిల్‌, టూర్‌ ఎస్‌ డీజిల్‌, విటారా బ్రెజా, ఎస్‌-క్రాస్‌ మోడళ్ల ధరలను రూ. 5వేల వరకు ఈ వారంలో తగ్గించింది. ఆటో పరిశ్రమ సంక్షోభాన్ని చవిచూస్తోన్న నేపథ్యంలో తమ కంపెనీ అమ్మకాలను పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 



You may be interested

అత్యంత విలువైన బ్రాండ్‌గా ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌’

Saturday 28th September 2019

సమాచార సేవల సంస్థ డబ్ల్యూపీ జాబితాలో తొలిస్థానం ముంబై: దేశీ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. భారత్‌లోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. సమాచార సేవల సంస్థ డబ్ల్యూపీ రూపొందించిన భారత అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో ఈ బ్యాంకింగ్‌ సంస్థ 22.70 బిలియన్‌ అమెరికా డాలర్ల విలువతో తొలి స్థానాన్ని దక్కించుకుంది. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ 20 బిలియన్‌ డాలర్ల విలువతో రెండవ స్థానంలో

టెక్‌ స్టార్ట్‌అప్స్‌లో ఫేస్‌బుక్‌ పెట్టుబడులు

Saturday 28th September 2019

- తాజాగా సోషల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాం ‘మీషో’లో పెట్టుబడి - మరిన్ని స్టార్ట్‌అప్స్‌ను అన్వేషిస్తున్నట్లు వెల్లడి న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. దేశీ టెక్నాలజీ స్టార్ట్‌అప్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. తాజాగా సోషల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాం ‘మీషో’లో తన తొలి పెట్టుబడిని పెట్టిన ఈ సంస్థ.. మరిన్ని స్టార్ట్‌అప్స్‌లో పెట్టుబడుల పరంపరాను కొనసాగించేందుకు సిద్దమైంది. ఈ విషయాన్ని సంస్థ భారత కార్యకలాపాల మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌

Most from this category