STOCKS

News


మారుతీ డీజిల్‌ కార్లకు భారీ డిమాండ్‌!

Tuesday 19th November 2019
news_main1574140716.png-29699

డిస్కౌంట్లు, వారెంటీ కారణమంటున్న నిపుణులు
మారుతీ సుజుకీ డీజిల్‌ కార్లకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. ఏప్రిల్‌ నుంచి కొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి రానుండడంతో పలు డీజిల్‌ మోడళ్ల ఉత్పత్తిని మారుతీ గతంలో తగ్గించింది. తాజా డిమాండ్‌తో కంపెనీ కొన్ని డీజిల్‌ వేరియంట్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. బీఎస్‌ 6 నిబంధనలకు అనుగుణంగా కొత్త కార్లను తయారు చేసే ముందు ఉన్న సరుకును విక్రయించేందుకు మారుతీ పలు డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన భారీ డిస్కౌంట్లు కస్టమర్లను ఆకట్టుకోవడంతో డీజిల్‌ కార్లకు డిమాండ్‌ పెరిగినట్లు నిపుణులు భావిస్తున్నారు. గత రెండు నెలల్లో విటారా బ్రెజా విక్రయాలు రెట్టింపై 14వేల యూనిట్లకు చేరాయి. దీంతో బ్రెజా డీజిల్‌ వేరియంట్ల ఉత్పాదనను కంపెనీ జనవరి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో పాటు వీటి ఉత్పత్తిని ఈ రెండు నెలలు నెలకు మరో మూడునాలుగు వేలు పెంచాలని భావిస్తోంది. బ్రెజాతో పాటు ఇతర డీజిల్‌ కార్ల ఉత్పత్తిని కూడా పెంచాలని, మూడు నెలల్లో మొత్తం 30వేల డీజిల్‌ కార్లు ఉత్పత్తి చేయాలని కంపెనీ నిర్ణయించుకున్నది. ఇది గత ప్రణాళికతో పోలిస్తే దాదాపు 30- 50 శాతం అధికం. ఉత్పత్తి పెంచడంతో కంపెనీ మరో వెయ్యిమంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంది. 
కొత్త నిబంధనలకు అనుగుణంగా...
మారుతీ ఒకపక్క డీజిల్‌ కార్ల ఉత్పత్తి పెంచుతూనే మరోపక్క బీఎస్‌6 వేరియంట్ల వాహనాలను ఉత్పత్తి చేయడం ఆరంభించింది. ప్రస్తుతం బ్రెజా పెట్రోల్‌ వేరియంట్‌ను కూడా తెస్తోంది. కొత్త నిబంధనలు వచ్చాక డీజిల్‌ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తామని కంపెనీ గతంలో ప్రకటించింది. కంపెనీ విక్రయాల్లో డీజిల్‌ వాహనాల వాటా 22 శాతం. మార్చి 31 తర్వాత వీటిని విక్రయించకూడదని నిర్ణయించుకోవడంతో ఈ వాహనాలపై సగటున రూ. లక్ష వరకు డిస్కౌంట్స్‌ ఇస్తోంది. ఈ డిస్కౌంట్‌కు తోడు దీర్ఘకాలిక వారెంటీ ఇవ్వడం... కస్టమర్లను బాగా ఆకర్షిస్తోందని వాహనరంగ నిపుణులు విశ్లేషించారు. అందువల్ల వీటికి డిమాండ్‌ సడెన్‌గా పెరిగిందని, బీఎస్‌ 6 నిబంధనలు అమలై, ధరలు పెరిగితే డీజిల్‌ వాహనాల డిమాండ్‌ గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. టయోటో సైతం దేశంలో చిన్న డీజిల్‌ వాహనాల ఉత్పత్తి ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇన్నోవా, ఫార్చూనర్‌ డీజిల్‌ వేరియంట్లను మాత్రం కొనసాగించనుంది. ఇటియోస్‌, ఇటియోస్‌ క్రాస్‌, లివా, కొరొలా ఆల్టిస్‌ డీజిల్‌ వేరియంట్లను మాత్రం నిలిపివేయనుంది. ప్రస్తుతం కంపెనీ విక్రయాల్లో 85 శాతం వాటా డీజిల్‌ వాహనాలదే, ఇందులో 60 శాతం వాటా ఎస్‌యూవీలదే! ప్రస్తుతం డీజిల్‌ వాహనాలకు డిమాండ్‌ ఇంకా కొనసాగుతూనే ఉందని, డిమాండ్‌ కొనసాగినంత కాలం డీజిల్‌లో పరిమిత వేరియంట్లు అందిస్తామని కంపెనీ డీఎండీ రాజా చెప్పారు. కొత్త నిబంధనల కారణంగా డీజిల్‌ వాహనాల ధరలు 15- 20 శాతం పెరుగుతాయన్నారు. You may be interested

వచ్చే 3 వారాల కోసం 3 టాప్‌ స్టాకులు

Tuesday 19th November 2019

-హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీష్‌, సీనియర్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ ఎనలిస్ట్‌, నందిష్‌ షా     నిఫ్టీ, నవంబర్‌ సిరిస్‌ ప్రారంభం నుంచి 200 పాయింట్ల తక్కువ పరిధిలో ట్రేడవుతూ వస్తోంది. అయినప్పటికి వారపు చార్టులలో ఎంఏసీడీ(మూవింగ్‌ యావరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌), డీఎంఐ(డైరక‌్షనల్‌ మూవ్‌మెంట్‌ ఇండెక్స్‌) ఇండికేటర్లు బుల్లిష్‌గా ఉన్నాయి. నిఫ్టీ తన 50, 100, 200 డీఎంఏ(డైలీ మూవింగ్‌ యావరేజ్‌)కి పైన ముగిసింది.అంతేకాకుండా టెక్నికల్‌ చార్టులో నిఫ్టీ హయ్యర్‌ టాప్స్‌ హయ్యర్‌ బాటమ్స్‌

మళ్లీ రూ.38000 పైకి పసిడి

Tuesday 19th November 2019

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు మళ్లీ డిమాండ్‌ పెరిగింది. డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ఫ్యూచర్‌ ధర మళ్లీ రూ.38000 అందుకుంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంపై మరోసారి అనుమానాలు రేకెత్తడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రెండు రోజుల్లో(సోమ, మంగళ)13పైసలు బలహీనపడటం, ఈక్విటీ మార్కెట్లు పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ అవుతుండటం తదితర అంశాలు

Most from this category