News


1.6 శాతం పెరిగిన మారుతి విక్రయాలు

Saturday 1st February 2020
news_main1580544114.png-31400


న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద​ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా కార్ల విక్రయాలు జనవరిలో 1.6 శాతం పెరిగాయని ప్రకటించింది. దీనిలో భాగంగా 1,51,721 యూనిట్ల  అమ్మకాలు జరిగాయని మారుతి సుజుకీ అధికారికంగా ప్రకటించింది. దేశీయంగా 1.7 శాతం విక్రయాలు పెరగడంతో 2018 జనవరిలో  1,42,150 యూనిట్లు అమ్మగా, ఈ ఏడాది జనవరిలో 1,44,499 యూనిట్లు విక్రయించామని తెలిపింది. ఆల్టో, వ్యాగన్‌ఆర్‌ కార్ల విక్రయం గతేడాదితో పోలిస్తే 11 శాతం పెరిగి 25,885 యూనిట్లును విక్రయించినట్లు పేర్కొంది. స్విఫ్ట్‌, సెలారియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ మోడళ్ల అమ్మకాలు 11.6 శాతం పెరిగాయని, 84,340 యూనిట్లు విక్రయించినట్లు పేర్కొంది. 
    



You may be interested

11800 పాయింట్ల దిగువన నిఫ్టీ

Saturday 1st February 2020

దేశీయ స్టాక్‌ ఎక్చేంజ్‌లు బడ్జెట్‌ రోజు తీవ్ర నష్టాలోకి జారాయి. మార్కెట్‌ ఆశించినట్లు ఎల్‌టీసీజీపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో సూచీలు భారీ నష్టాల్లోకి మరలాయి. నిఫ్టీ 11800 పాయింట్ల మద్దతు కోల్పోయి 11741 పాయింట్ల కనిష్టానికి చేరింది. సెన్సెక్స్‌ దాదాపు 40వేల పాయింట్ల వద్దకు చేరింది. ఐటీ మినహాయింపులు, ఎల్‌ఐసీ ఐపీఓ, డీడీటీ ఎత్తివేత లాంటివి మార్కెట్‌ను పెద్దగా రంజింపజేయలేకపోయాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉండడం

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌: 11880 దిగువకు నిఫ్టీ

Saturday 1st February 2020

 ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో మార్కెట్‌కు ప్రభావితం చేసే అంశాలేవి లేకపోవడంతో సూచీలు మిడ్‌సమయానికి తీవ్రంగా నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీ ఇండెక్స్‌ 93 పాయింట్లు నష్టపోయి 11,869.00 స్థాయికి దిగివచ్చింది. సెన్సెక్స్‌ 279 పాయింట్లను కోల్పోయి 40,444.44 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మెటల్‌, బ్యాంకింగ్‌, రియల్టీ, మీడియా రంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఆర్థిక సంవత్సరం 2020-21లో వైద్య రంగానికి రూ.69 వేల

Most from this category