News


మారుతీ సుజుకీ ఉత్పత్తిలో పెరుగుదల

Thursday 9th January 2020
news_main1578540309.png-30775

- డిసెంబర్‌లో 7.88 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. గతేడాది డిసెంబర్‌ నెలలో తన వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,15,949 యూనిట్లుగా నమోదైనట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అంతక్రితం ఏడాది (2018) డిసెంబర్‌ నెలలోని 1,07,478 యూనిట్ల ఉత్పత్తితో పోల్చితే ఈసారి 7.88 శాతం వృద్ధి చెందినట్లు వివరించింది. గతేడాదిలో డిమాండ్‌ తగ్గిపోయిన కారణంగా వరుసగా తొమ్మిది నెలల పాటు ఉత్పత్తిలో కోత విధించిన ఎంఎస్‌ఐ.. నవంబర్‌లో 4.33 శాతం ఉత్పత్తి పెంపును ప్రకటించింది. దీంతో గడిచిన రెండు నెలల్లో మళ్లీ వృద్ధిని నమోదుచేసినట్లైంది. ఇక కాంపాక్ట్‌ విభాగంలోని ప్రధాన మోడల్స్‌ సిఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్, వేగనార్‌ ఉత్పత్తి పెంపుతో గత నెల్లో ఈ విభాగం 40.87 శాతం వృద్ధిని చూపింది. యుటిలిటీ వాహనాల ఉత్పత్తి 20.62 శాతం పెరగ్గా, మినీ సెగ్మెంట్‌ 9.54 శాతం తగ్గింది. 



You may be interested

భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌?!

Thursday 9th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 120 పాయింట్లు అప్‌ నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ బుధవారం ఉదయం  8.40 ప్రాంతం‍లో 120 పాయింట్లు జంప్‌చేసి 12,186 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,065 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్‌

క్యూ3, క్యూ4లలో బ్యాంకింగ్‌కు వెలుగురేఖలు!

Thursday 9th January 2020

- భారీ మొండిబకాయిల పరిష్కారం నేపథ్యం - ఎస్‌బీఐ చైర్మన్‌ రజ్‌నీష్‌ కుమార్‌ విశ్లేషణ - నిత్యావసరాలపై అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తత ప్రభావం ముంబై: భారత్‌ బ్యాంకింగ్‌ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో (అక్టోబర్‌ 2019 - మార్చి2020)లో చక్కటి ఫలితాలు నమోదుచేసుకునే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టే్‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజ్‌నీష్‌ కుమార్‌ విశ్లేషించారు. భారీ మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారం దీనికి ప్రధాన

Most from this category