News


తగ్గిన మారుతీ సుజుకీ మార్కెట్‌ వాటా

Monday 16th September 2019
news_main1568606727.png-28390

  • ఏప్రిల్‌-ఆగస్టు కాలంలో 2 శాతం పతనం

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్‌-ఆగస్టు కాలంలో గణనీయంగా తగ్గాయి. భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య (సియామ్‌) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ కాలంలో 11,09,930 యూనిట్లు అమ్ముడు కాగా, గతేడాది ఇదే కాలంలో 14,51,647 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.  ద్రవ్యలభ్యత కొరత, అధిక బీమా, భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనల అమలు వంటి ప్రతికూల అంశాల కారణంగా పరిశ్రమ మందగమనంలో పడిపోగా.. పీవీ విక్రయాల్లో మార్కెట్‌ లీడర్‌గా ఉన్న మారుతి సుజుకీ విక్రయాలు పేర్కొన్న కాలంలో భారీగా తగ్గాయి. గతేడాది ఏప్రిల్‌-ఆగస్టులో 7,57,289 యూనిట్లను విక్రయించిన కంపెనీ.. ఈ ఏడాదిలో 5,55,064 యూనిట్లను విక్రయించింది. దీంతో 52.16 శాతంగా ఉన్న మార్కెట్‌ వాటా 49.83 శాతానికి పడిపోయింది. ఈ అంశంపై కంపెనీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘కార్లు, వ్యాన్లు అమ్మకాలు బాగానే కొనసాగగా.. యుటిలిటీ వాహనాల్లో క్షీణత ఉంది. ఎర్టిగా వంటి వాహనాలకు నిరీక్షణ కాలం అధికంగా ఉండడం కూడా ఇందుకు కారణం. వినియోగదారులు ఎస్‌యూవీలో పెట్రోల్‌ వేరియంట్‌ను ఇష్టపడుతుండగా.. ఈ వేరియంట్‌లో కంపెనీ లేకపోవడం కూడా విక్రయాలు తగ్గుదలకు కారణంగా విశ్లేషిస్తున్నాం’ అని అన్నారు.

పెరిగిన ఎం అండ్‌ ఎం, హ్యుందాయ్ వాటా
అమ్మకాల్లో క్షీణత ఉన్నప్పటికీ ఇతర కంపెనీల మార్కెట్‌ వాటాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. హ్యుందాయ్ ఏప్రిల్‌-ఆగస్టు అ‍మ్మకాలు 2,03,729 యూనిట్లు అమ్ముడు కాగా, గతేడాది ఇదే కాలంలో 2,26,396 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అయితే, మార్కెట్‌ వాటా మాత్రం 2.77 మేర పెరిగింది. 15.59 శాతం నుంచి 18.36 శాతానికి ఎగబాకింది. ఇక ఎం అండ్‌ ఎం 89,733 యూనిట్లను విక్రయించింది. ఈ కంపెనీ మార్కెట్‌ వాటా 6.89 శాతం నుంచి 8.08 శాతానికి పెరిగింది. టయోటా కిర్లోస్కర్ 53,977 యూనిట్లను విక్రయించింది. గతేడాది అమ్మకాలు 67,051 యూనిట్లు కాగా, మార్కెట్‌ వాటా 4.62 శాతం నుంచి 4.86 శాతానికి పెరిగింది. You may be interested

ప్రభుత్వ చర్యలు నిరాశపరిచాయి: క్రెడాయ్‌

Monday 16th September 2019

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కేంద్రం ప్రకటించిన చర్యలు నిరాశపరిచినట్టు ఆ రంగానికి చెందిన అత్యున్నత సంఘం క్రెడాయ్‌ అభిప్రాయపడింది. పన్ను రాయితీలు, గృహ కొనుగోలుదారులకు, గృహ నిర్మాణదారులకు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వాలనే డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. నిలిచిపోయిన ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రకటించిన నిధి ప్రభావం పరిమితమేనని, ఎందుకంటే దివాలా చర్యలు ఎదుర్కొంటున్నవి, ఎన్‌పీఏలుగా మారిన ప్రాజెక్టులను ఈ ప్యాకేజీ నుంచి మినహాయించడమేనని గుర్తు

ఐపీఓ.. అంతంత మాత్రమే !

Monday 16th September 2019

ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్‌ తగ్గిన ఐపీఓల జోరు  11 కంపెనీలు.. 10,300 కోట్ల సమీకరణ  రానున్న మూడు నెలల్లో అరకొరగానే ఐపీఓలు ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్‌ అంతంతమాత్రంగానే ఉండటం  ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)లపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. గత ఏడాది మొత్తం 24 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.30,959 కోట్ల నిధులు సమీకరిస్తే, ఈ ఏడాది ఇప్పటివరకూ 11 కంపెనీలు రూ.10,300 కోట్ల మేర మాత్రమే నిధులను సమీకరించగలిగాయి. ఇక 2017లో మాత్రం ఐపీఓల

Most from this category