News


పశ్చిమాసియా టెన్షన్లను తక్కువ చేసి చూస్తున్నారు!

Friday 10th January 2020
Markets_main1578641539.png-30830

మార్కెట్లపై ఎకనమిస్టు నోరియల్‌ రౌబిని
ప్రపంచ మార్కెట్లు యూఎస్‌, ఇరాన్‌ ఉద్రిక్తతలను తక్కువ చేసి చూస్తున్నాయని ప్రముఖ ఎకనమిస్టు నోరియల్‌ రౌబిని హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం రాకున్నా ప్రస్తుత టెన్షన్లు మరింత పెరిగేందుకు మాత్రం 50 శాతం ఛాన్సుందని అంచనా వేశారు. ఇదే జరిగితే క్రూడాయిల్‌ 80 డాలర్లను చేరవచ్చన్నారు. ఇది ఇండియాకు మంచిది కాదని చెప్పారు. ఇండియాకు క్రూడాయిల్‌ ధర 80 డాలర్లను చేరితే విత్త, వాణిజ్య టెన్షన్లు ఎదురవుతాయన్నారు. దేశంలో స్థూల ఆర్థిక విధానాలు ఇంకా అనువుగా లేవని చెప్పారు.

2008 ఆర్థిక సంక్షోభాన్ని కరెక్టుగా అంచనా వేసిన ఎకనమిస్టుగా రౌబినికి మంచి పేరుంది. ‘‘డాక్టర్‌ డూమ్‌’’గా ఈయన ప్రసిద్ధుడు.

దేశీయ మార్కెట్‌ చుట్టూ ఉన్న పరిస్థితులు విదేశీ ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఈ సమయంలో కేవలం ఎకానమీపై దృష్టి సారించాలని, ఈ సమయంలో ఇతర భావజాల, నైతిక విషయాల కారణంగా ఎకానమీపై ఫోకస్‌ తగ్గించకూడదని సలహా ఇచ్చారు. ఎకానమీ మరింత దిగజారితే ప్రధాని మోదీ పాపులారిటీ దిగజారవచ్చన్నారు. ప్రపంచంతో సహా భారత్‌లో కూడా ఆర్థిక మందగమనం కొనసాగుతుందని రౌబిని అంచనా వేశారు. ప్రపంచ జీడీపీ 3 శాతానికి పరిమితం కావచ్చన్నారు. అలాగని ప్రపంచ మాద్యం వచ్చే అవకాశాలు లేవని, కానీ మందగమనం మాత్రం కొంతకాలం ఉంటుందని చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్‌ ఉద్రిక్తతలు రావడం మంచిది కాదన్నారు.

ట్రేడ్‌వార్‌ టెన్షన్స్‌ తగ్గినా, యూఎస్‌- చైనా మధ్య శత్రుత్వం కొనసాగుతుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య కోల్డ్‌వార్‌ వచ్చే దశాబ్దంలో మరింత విస్తృతమవుతుందన్నారు. ట్రేడ్‌ డీల్‌ కుదిరినా ఇరుదేశాల మధ్య సంబంధాలు అతుక్కోవని, దీనివల్ల అంతర్జాతీయ వృద్ధి రాబోయే సంవత్సరాల్లో కూడా తగ్గుతుందని చెప్పారు. మరోవైపు బ్రెగ్జిట్‌ అంతిమ డీల్‌కు సంబంధించిన చర్చలు మరింత కాలం కొనసాగవచ్చని రౌబిని చెప్పారు. వర్ధమాన మార్కెట్లలో చైనా మరింత మందకొడిగా తయారవుతుందని, ఇండియా మాత్రం 2020 ద్వితీయార్ధంలో రికవరీ చూస్తుందని తెలిపారు. అయితే ఎక్కువ శాతం వర్ధమాన మార్కెట్లు కొన్నేళ్ల పాటు దుర్బలంగానే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. 



You may be interested

క్యూ3లో ఈ కంపెనీల లాభాలు జూమ్‌

Friday 10th January 2020

గత కేలండర్‌ ఏడాది(2019)లో దేశీ స్టాక్‌ మార్కెట్లు విభిన్న పనితీరు ప్రదర్శించాయి. ఓవైపు ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్‌, నిఫ్టీ 12 శాతం స్థాయిలో ర్యాలీ చేయగా.. మిడ్‌ క్యాప్‌ 4 శాతం, స్మాల్‌ క్యాప్‌ 9 శాతం చొప్పున డీలాపడ్డాయి. కాగా.. డిసెంబర్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను సైతం అందుకున్నాయి. అయితే ఇకపై మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు సైతం మెరుగైన రిటర్నులు అందించగలవన్న అంచనాలు ఇటీవల అధికమయ్యాయి.

తొలిసారి 12300 దాటిన నిఫ్టీ

Friday 10th January 2020

కలిసొచ్చిన ఐటీ, బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ  మరో ఆల్‌టైమ్‌ హై రికార్డు సొంతం కొత్త ఏడాదిలో నిఫ్టీ ఇండెక్స్‌ సరికొత్త జీవితకాల గరిష్టా‍న్ని నమోదు చేసింది. గతేడాది డిసెంబర్‌ 20న నమోదు చేసిన 12,293.90 స్థాయిని అధిగమించి 12,303 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. ఇరాన్‌, అమెరికా మధ్య గత వారం నెలకొన్న ఉద్రిక్త వాతావరణం సద్దుమనగడంతో నేటి ఉదయం నిఫ్టీ ఇండెక్స్‌  మునుపటి ముగింపుతో పోలిస్తే 12,216 పోలిస్తే

Most from this category