News


మ్యారికో అమ్మకాలు రూ.1,829 కోట్లు

Saturday 26th October 2019
news_main1572065237.png-29159

  • ఒక్కో షేర్‌కు రూ.2.75 మధ్యంతర డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ మ్యారికో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 17 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.216 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.253 కోట్లకు పెరిగిందని మ్యారికో తెలిపింది. గత క్యూ2లో రూ.1,837 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ2లో రూ.1,829 కోట్లకు తగ్గాయని పేర్కొంది. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2.75 (275 శాతం) డివిడెండ్‌ను ఇవ్వనున్నది. నిర్వహణ లాభం 2.7 శాతం ఎగసి 16 శాతానికి చేరిందని కంపెనీ వివరించింది. మొత్తం వ్యయాలు  రూ.1,573 కోట్ల నుంచి 3 శాతం తగ్గి రూ.1,524 కోట్లకు చేరాయని తెలిపింది. దేశీయ అమ్మకాలు రూ.1,439 కోట్ల నుంచి 3 శాతం తగ్గి రూ.1,398 కోట్లకు తగ్గగా, అంతర్జాతీయ వ్యాపారం రూ.398 కోట్ల నుంచి 8 శాతం పెరిగి రూ.431 కోట్లకు పెరిగిందని వివరించింది. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 55 పాయింట్లు అప్‌

Saturday 26th October 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం భారీ లాభంతో ముగిసింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11609తో పోలిస్తే 55 పాయింట్లు లాభంతో ఉంది. నిన్న ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి దాదాపు ఫ్లాట్‌ ముగిశాయి. సెన్సెక్స్‌ 37.67 పాయింట్ల లాభంతో 39,058.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 1.30 పాయింట్ల లాభంతో 11,583.90 వద్ద ముగిసింది. ఈ వారం మొత్తం మీద

అర్‌వింద్‌ లాభం రూ.50 కోట్లు

Saturday 26th October 2019

రూ.1,962 కోట్లకు మొత్తం అమ్మకాలు  న్యూఢిల్లీ: టెక్స్‌టైల్స్‌ దిగ్గజం అర్‌వింద్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.50 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.56 కోట్ల నికర లాభం ఆర్జించామని అర్‌వింద్‌ కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు ఈ క్యూ2లో రూ.1,962 కోట్లుగా ఉండగా, గత క్యూ2లో రూ.1,793 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ఈ కంపెనీ నుంచి బ్రాండెడ్‌ దుస్తుల విభాగం

Most from this category