News


అబ్బో!  తయారీ కంపెనీలకు ఇన్ని అనుమతులా?

Wednesday 29th January 2020
news_main1580294845.png-31311


తయారీ కంపెనీలకు 2 వేల అనుమతులు
 ఫిక్కీ అధ్యయనం
న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా కంపెనీ లేదా ఫ్యాక్టరీని నెలకొల్పాలంటే అనేక నిబంధనలకు లోబడి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో 1,984 నిబంధనలు అధిగమించాల్సి ఉంటుందని  ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌ఐసీసీఐ) జరిపిన అధ్యయనం వెల్లడించింది. దాదాపు రెండు వేల వరకు ఉన్న ఈ నిబంధనలను అనుసరించి కొత్త తయారీ కంపెనీని ప్రారంభించాలంటే అధిక సమయంతోపాటు చాలా ఖర్చు అవుతుందని ఫిక్కీ తెలిపింది. నిబంధనలు కొంత మేర సవరించాలని కేంద్ర బడ్జెట్‌ రూపకల్పన అధికారులకు ఫిక్కీ నివేదించింది. ఏదైనా ఒక పారిశ్రామిక  ప్రతిపాదనను అమోదించి, అమలు చేయాలంటే కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించి పర్యావరణ, కార్మిక చట్టాలు, జీఎస్టీ, కంపెనీల చట్టాలతో కలిపి మొత్తం 122 చట్టాలను అనుసరించాల్సి వస్తుందని ఫిక్కీ తెలిపింది. కంపెనీ లేదా పరిశ్రమను బట్టి చట్టాలను సవరిస్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయి. అనుమతులు తీసుకోవడం జఠిలంగా ఉంటే పెట్టుబడిబాదురులు వెనక్కి తగ్గే అవకాశం లేకపోలేదని, అందువల్ల ఈ బడ్జెట్‌లో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఫిక్కీ కోరింది. 



You may be interested

479శాతం ర్యాలీ చేసిన జపాన్‌ షేరు ఇదే..!

Wednesday 29th January 2020

కొత్త పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. అయితే  ఈ వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో జపాన్, సౌత్‌ కొరియా, ఇండియా స్టాక్‌ మార్కెట్లలో హెల్త్‌కేర్‌, సేఫ్టీ ప్రాడెక్ట్‌ల షేర్లకు డిమాండ్‌ పెరిగింది. మాస్క్‌లతో పాటు వైద్య ఉత్పత్తులను సరఫరా చేసే జపాన్ సంస్థ కవామోటో కార్పొరేషన్ షేరు ఈ జనవరిలో ఐదు రెట్లు పెరిగింది. టోక్యో స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లో డిసెంబర్‌ 30నాడు 447

కరోనాకు చెక్‌- సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ

Wednesday 29th January 2020

41,200కు చేరిన సెన్సెక్స్‌  74 పాయింట్లు పెరిగిన నిఫ్టీ  ఎట్టకేలకు కరోనా భయాలకు చెక్‌ పడింది. యాపిల్‌ అండతో మంగళవారం అమెరికా మార్కెట్లు లాభపడగా..  బడ్జెట్‌పై ఆశలతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ చేసింది. వెరసి మళ్లీ 41,000 స్థాయిని అధిగమించింది. 232 పాయింట్లు పెరిగి 41,199 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 74 పాయింట్లు జమ చేసుకుని 12,130 వద్ద స్థిరపడింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు

Most from this category