News


మణప్పురం ఫైనాన్స్‌ లాభం 63 శాతం అప్‌

Wednesday 29th January 2020
news_main1580276356.png-31295

  • రూ.398 కోట్లకు పెరిగిన నికర లాభం 
  • స్వల్పంగా తగ్గిన మొండి బకాయిలు 

ముంబై: బంగారం తాకట్టు రుణాలిచ్చే మణప్పురం ఫైనాన్స్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 63 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.244 కోటుల్గా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.398 కోట్లకు పెరిగిందని మణప్పురం ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.1,399 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నిర్వహణ ఆస్తులు 36 శాతం పెరిగి రూ.24,100 కోట్లకు చేరాయని వివరించింది. 

స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, ఈ క్యూ3లో నికర లాభం 58 శాతం పెరిగి రూ.332 కోట్లకు పెరిగింది. మొండి బకాయలు స్వల్పంగా తగ్గాయి. గత క్యూ3లో 0.58 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 0.50 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 10 బేసిస్‌ పాయింట్లు తగ్గి 0.22 శాతానికి చేరాయి. 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 29th January 2020

  వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కు చెందిన వివిధ రకాల ఆస్తుల విక్రయానికి ఆర్బీఐ నియమించిన కమిటీ బిడ్స్‌ను ఆహ్వానించింది.  మహీంద్ర అండ్‌ మహీంద్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: డిసెంబర్‌ 31న ముగిసిన క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 16 శాతం పెరిగి రూ.475 కోట్లకు చేరిందని మహీంద్ర అండ్‌ మహీంద్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. యస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ పవర్‌: రిలయన్స్‌ పవర్‌కు

మార్కెట్లోకి ‘అథర్‌ 450ఎక్స్‌’ ఈ-స్కూటర్‌

Wednesday 29th January 2020

ధరల శ్రేణి రూ. 99,000 – 1,59,000  3.3 సెకన్లలో 40 కి.మీ వేగానికి న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌కు చెందిన ‘అథర్‌ ఎనర్జీ’.. మరో సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘అథర్‌ 450ఎక్స్‌’ పేరిట విడుదలైన ఈ-స్కూటర్‌.. 6 కిలోవాట్ మోటార్‌, కొత్త 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. కంపెనీకి చెందిన మునుపటి మోడల్‌ 450కి అప్‌డేటెడ్‌

Most from this category