News


తగ్గిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు

Monday 2nd September 2019
news_main1567401895.png-28143

  • ఆగస్టులో భారీ క్షీణత
  • మారుతీ అమ్మకాల్లో 33 శాతం తగ్గుదల 

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన(పీవీ) విక్రయాలు మళ్లీ భారీ తగ్గుదలను నమోదుచేశాయి. ఆగస్టులో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్‌, హోండా కార్స్‌ అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. మారుతీ విక్రయాలు 33 శాతం తగ్గాయి. అధిక బీమా, ద్రవ్యలభ్యత కొరత, వడ్డీ వ్యయం పెరగడం, బీఎస్‌-6 ఉద్గార నిబంధనల అమలు, రిజిస్ట్రేషన్‌ వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనంగా ఉందని హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సిఐఎల్‌) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌) రాజేష్‌ గోయెల్‌ అన్నారు. ఆగస్టులోనూ ఇవే ప్రతికూలతలు కొనసాగినందున ఈ స్థాయి క్షీణత నమోదైందని టీకేఎం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా వ్యాఖ్యానించారు. ఆటో రంగంలో మందగమనం కొనసాగుతున్నప్పటికీ తమ కంపెనీ రిటైల్‌ అమ్మకాలపై దృష్టిసారిస్తుందని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీక్‌ అన్నారు. 



You may be interested

ఒక్క ఉద్యోగం కూడా పోదు..

Monday 2nd September 2019

బ్యాంకుల విలీనంపై ఆర్థిక మంత్రి భరోసా బ్యాంకులకు మరింత మూలధనం  రంగాలవారీగా సమస్యల పరిష్కారంపై దృష్టి న్యూఢిల్లీ: బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయన్న ఉద్యోగ సంఘాల వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. విలీనాలతో ఏ ఒక్క ఉద్యోగం కూడా పోదని స్పష్టం చేశారు. "ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమే. గత శుక్రవారం ఏం చెప్పానో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ ఒక్క ఉద్యోగి తొలగింపు ఉండబోదని

నష్టాల్లో ప్రారంభమైన అంతర్జాతీయ మార్కెట్లు

Monday 2nd September 2019

యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా ఇరు దేశాలు విధించికున్న తాజా టారిఫ్‌లు సెప్టెంబర్‌ 1 నుంచి అమలులోకి రావడంతో అంతర్జాతీయ ఆర్థిక మందగమనంపై ఇన్వెస్టర్ల ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా సెప్టెంబర్‌ 2(సోమవారం) ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. యుఎస్‌ ఎస్‌ అండ్‌ పీ ప్యూచర్‌ 1.06 శాతం నష్టపోగా, జపాన్‌ నికాయ్‌ 225 0.28 శాతం, ఎంఎస్‌సీఐ జపాన్‌ వెలుపల ఆసియా పసిఫిక్‌ షేర్స్‌ ఇండెక్స్‌ 0.3 శాతం  నష్టపోయాయి.

Most from this category