News


మహీంద్రా వాహన రేట్ల పెంపు

Thursday 20th June 2019
Markets_main1561014906.png-26438

  • రూ. 36,000 దాకా పెరుగుదల
  • జూలై 1 నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) వివిధ రకాల వాహనాల రేట్లను రూ. 36,000 దాకా పెంచనుంది. జూలై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ప్యాసింజర్ వాహనాల్లో ఏఐఎస్‌ 145 భద్రతా ప్రమాణాల నిబంధనలు అమల్లోకి వస్తుండటంతో రేట్ల పెంపు అనివార్యమవుతోందని కంపెనీ వెల్లడించింది. స్కోర్పియో, బొలెరో, టీయూవీ300, కేయూవీ100 ఎన్‌ఎక్స్‌టీ మోడల్స్‌పై అత్యధికంగాను, ఎక్స్‌యూవీ300 .. మరాజోపై స్వల్పంగా రేట్ల పెంపు ఉంటుందని మహీంద్రా వెల్లడించింది. ప్యాసింజర్‌ వాహనాల్లో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌, సీట్‌ బెల్ట్ రిమైండర్‌, రియర్ పార్కింగ్ సెన్సార్‌ మొదలైన ఫీచర్స్‌ను తప్పనిసరి చేసే ఏఐఎస్‌ 145 భద్రత ప్రమాణాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. భద్రతాపరమైన ఫీచర్స్‌ కారణంగా వ్యయాలు పెరిగిపోవడం వల్ల కొన్ని ఉత్పత్తులపై తామూ రేట్లు పెంచక తప్పడం లేదని ఎంఅండ్‌ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) రాజన్ వధేరా తెలిపారు.



You may be interested

బీఎస్‌-6 వాహనాల క్యూ!!

Thursday 20th June 2019

మార్కెట్లోకి ఒకదాని వెంట ఒకటి 2020 ఏప్రిల్‌ 1 నుంచి నూతన ప్రమాణాలు కొత్త టెక్నాలజీకై కంపెనీల భారీ పెట్టుబడి మొత్తం వ్యయం రూ.80,000 కోట్లు! ప్రియం కానున్న వాహనాల ధర హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశంలో బీఎస్‌-6 ప్రమాణాల అమలు గడువు దగ్గర పడుతుండటంతో వాహన కంపెనీలు కొత్త మోడళ్ల ఆవిష్కరణలను వేగవంతం చేశాయి. ఒకదాని వెంట ఒకటి బీఎస్‌-6 వేరియంట్లను సిద్ధం చేస్తున్నాయి. వాహన కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే భారత్‌ స్టేజ్‌-6 ప్రమాణాలు 2020

జెట్‌ దివాలాపై నేటి నుంచి విచారణ

Thursday 20th June 2019

పార్టీలుగా చేర్చాలని ఎన్‌సీఎల్‌టీకి పైలట్లు, ఇంజినీర్ల వినతి ముంబై: రుణ సంక్షోభంతో కుప్పకూలిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ దివాలాకు సంబంధించిన పిటిషన్‌పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గురువారం నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను కూడా పార్టీలుగా చేర్చాలని జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్‌కి చెందిన రెండు లాజిస్టిక్స్ వెండింగ్‌ సంస్థలు కూడా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి. తాము ఇంటర్‌వెన్షన్

Most from this category