STOCKS

News


మహీంద్రా లాభం 85 శాతం డౌన్‌

Wednesday 12th February 2020
news_main1581476315.png-31704

  • తీవ్రంగా ప్రభావం చూపిన మందగమనం 
  • 4 శాతం తగ్గిన ఆదాయం 
  • స్వల్పంగా పెరిగిన మార్జిన్లు

ముంబై: వాహన దిగ్గజం  మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో 85 శాతం క్షీణించి రూ..200 కోట్లకు తగ్గిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. డిమాండ్‌ సంక్షోభం కారణంగా వాహన అమ్మకాలు తగ్గడంతో నికర లాభం ఈ రేంజ్‌లో తగ్గిందని తెలిపింది. గత క్యూ3లో రూ.519 కోట్ల వన్‌టైమ్‌ లాభాలు రాగా, ఈ క్యూ3లో రూ.554 కోట్ల వన్‌టైమ్‌ నష్టాలు రావడం కూడా ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. మొత్తం ఆదాయం 4 శాతం తగ్గి రూ.25,303 కోట్లకు చేరింది. మార్జిన్లు మాత్రం 13.2 శాతం నుంచి 14.8 శాతానికి చేరాయి.  మరిన్ని వివరాలు.....

8 శాతం తగ్గిన వాహన విక్రయాలు...
స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం 73 శాతం తగ్గి రూ.380 కోట్లకు, ఆదాయం 6 శాతం తగ్గి రూ.12,120 కోట్లకు తగ్గింది. వాహన విక్రయాలు 8 శాతం తగ్గి 1.23 లక్షలకు చేరాయి. ట్రాక్టర్లు 6 శాతం తగ్గి 81,453కు, ఎగుమతులు 22 శాతం తగ్గి 9,633కు తగ్గాయి. అమ్మకాలు ఇప్పట్లో పుంజుకునే పరిస్థితుల లేవని కంపెనీ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల వరకూ (ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకూ) మందగమనం కొనసాగగలదని, ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం 5 శాతం పెరగగలవని అంచనా వేస్తోంది. వర్షాలు సాధారణంగానే ఉంటాయన్న అంచనాలు, గ్రామీణ ఆదాయం పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించడం వంటి కారణాల వల్ల ట్రాక్టర్ల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తోంది. 

మూడేళ్లలో నాలుగు కొత్త మోడళ్లు...
మహీందా కంపెనీ మోడళ్ల బీఎస్‌-సిక్స్‌ వేరియంట్ల ధరలు రూ.20,000(పెట్రోల్‌) నుంచి రూ.1.3 లక్షలు(డీజిల్‌)కు పెరుగుతాయని  కంపెనీ ఎమ్‌డీ పవన్‌ గోయెంకా చెప్పారు.  మూడేళ్లలో నాలుగు కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. దేశీయ మార్కెట్లో నెలకొన్న మందగమనాన్ని తట్టుకోవడానికి కొత్త దేశాలకు ఎగుమతులు ఆరంభించనున్నామని  తెలిపారు. కష్టాల్లో ఉన్న తమ కొరియా విభాగం, శాన్‌యాంగ్‌ కోసం రెండేళ్లలో 50 కోట్ల వాన్లు పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. 

ఏప్రిల్‌ తర్వాత జేవీ వాహనాలు...
మహీంద్రా-ఫోర్డ్‌ జాయింట్‌ వెంచర్‌ తయారు చేసే వాహనాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి వస్తాయని గోయెంకా తెలిపారు. ఈ జేవీకి కాంపిటీషన్‌ కమషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆమోదం లభించిందని పేర్కొన్నారు. సీ-ఎస్‌యూవీ, బి-ఎస్‌యూవీ కోడ్‌ పేర్లతో రెండు ఎస్‌యూవీలను తయారు చేస్తున్నామని, ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత ఈ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తామని వివరించారు. ఈ జేవీ కోసం తమ రెండు కంపెనీలు రూ.15,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. 
 



You may be interested

కోల్‌ ఇండియా లాభం రూ.3,922 కోట్లు

Wednesday 12th February 2020

కోల్‌కత: మైనింగ్‌ దిగ్గజం కోల్‌ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 14 శాతం పతనమై రూ.3,922 కోట్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ3లో రూ.23,385 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో రూ.21,566 కోట్లకు చేరాయని కోల్‌ ఇండియా తెలిపింది. మొత్తం సమగ్ర ఆదాయం రూ.4,140 కోట్ల నుంచి రూ.3,670 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఇంధన సరఫరా ఒప్పందం(ఎఫ్ఎస్‌ఏ) ప్రకారం

స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కరోనా కష్టాలు..

Wednesday 12th February 2020

చైనా నుంచి పరికరాల సరఫరా సమస్యలు దేశీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం ఈ వారం పరిస్థితి చక్కబడొచ్చని ఆశలు న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ .. దేశీ స్మార్ట్‌ఫోన్స్ పరిశ్రమను కూడా కలవరపెడుతోంది. పరికరాలు, సబ్-అసెంబ్లీస్ కోసం చైనాపై ఆధారపడిన దేశీ కంపెనీలకు .. సరఫరాపరమైన సమస్యలతో క్రమంగా సెగ తగులుతోంది. చైనాలో మూతబడిన ఫ్యాక్టరీలు మళ్లీ తెరుచుకుని, ఈ వారంలోనైనా ఉత్పత్తుల సరఫరా ప్రారంభమవుతుందేమోనని స్మార్ట్‌ఫోన్ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. "దేశీ

Most from this category