News


మార్కెట్లోకి మహీంద్రా కొత్త బొలెరొ సిటీ పిక్‌ అప్‌

Friday 30th August 2019
news_main1567146314.png-28111

  • ప్రారంభ ధర రూ.6.25 లక్షలు

బెంగళూరు: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’ (ఎం అండ్‌ ఎం).. ప్రత్యేకించి నగర అవసరాలకు తగిన విధంగా రూపొందించిన ‘బొలెరొ సిటీ పిక్‌-అప్‌’ వాహనాన్ని గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన పిక్‌-అప్‌ వాహన ధర రూ.6.25 లక్షలు(ఎక్స్‌షోరూమ్‌- బెంగళూరు)గా నిర్ణయించింది. ఫోర్‌-సిలెండర్‌.. 2,523 సీసీ డిజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ నూతన వాహనానికి 1.4 టన్నుల పేలోడ్ సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ మార్కెటింగ్‌, ఆటోమోటీవ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్ గార్గా మాట్లాడుతూ.. ‘పిక్‌-అప్‌ వాహన అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త వాహనం విడుదల సరిపోతుంది. నగరాల మధ్య అవసరాలు తీర్చడానికి బొలెరొ మ్యాక్సిట్రక్‌ ప్లస్‌ ఉండగా.. నూతన సిటీ పిక్‌-అప్‌ నగర అవసరాలకు సరిపోతుంది’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

అదానీ చేతికి ఎస్సెల్‌ సోలార్‌ ప్లాంట్లు

Friday 30th August 2019

డీల్‌ విలువ రూ.1,300 కోట్లు  ముంబై: ఎస్సెల్‌ గ్రూప్‌నకు చెందిన సౌర శక్తి ప్లాంట్లను అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ట్రాన్సిమిషన్‌ కొనుగోలు చేయనున్నది. ఎస్సెల్‌ గ్రూప్‌నకు చెందిన రెండు అనుబంధ సం‍స్థలు-ఎస్సెల్‌ గ్రీన్‌ ఎనర్జీ, ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ఆధ్వర్యంలోని 205 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లను రూ.1,300 కోట్లకు కొనుగోలు చేస్తున్నామని అదానీ గ్రీన్‌ ఎనర్జీ తెలిపింది. ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య నిశ్చయాత్మక ఒప్పందం

కేంద్రానికి ఆర్‌బీఐ నిధులు మంచికే: ఏడీబీ

Friday 30th August 2019

న్యూఢిల్లీ: కేంద్రానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిధులను బదలాయించడం ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి దోహదపడుతుందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) ప్రెసిడెంట్‌  తకిహికో నకయో పేర్కొన్నారు. రూ.1.76 లక్షల కోట్ల మిగులు బదలాయింపు ‘‘తగిన విధానం’’గా ఆయన పేర్కొన్నారు. ఈ ధోరణి పెట్టుబడులకు సానుకూలమైనదని వివరించారు. ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అమెరికా-చైనా వాణిజ్య వివాదం నుంచి కొన్ని భారత్‌ పరిశ్రమలు ప్రయోజనం పొందవచ్చని అన్నారు.

Most from this category