News


మహీంద్రా ఫైనాన్స్‌ లాభం రూ.475 కోట్లు

Wednesday 29th January 2020
news_main1580272757.png-31287

  • 16 శాతం వృద్ధి 
  • 14 శాతం పెరిగి రూ.3,081 కోట్లకు ఆదాయం

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.475 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆర్జించిన నికర లాభం, రూ.409 కోట్లుతో పోల్చితే 16 శాతం వృద్ధి సాధించామని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తెలిపింది. ఆదాయం రూ.2,705 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ. 3,081 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండ్‌ అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ3లో రూ.319 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 14 శాతం వృద్ధితో రూ.365 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.2,246 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.2,616 కోట్లకు ఎగసింది. 



You may be interested

మారుతీ లాభం రూ.1,587 కోట్లు

Wednesday 29th January 2020

(అప్‌డేటెడ్‌...) 4 శాతం వృద్ధి  రూ.20,722 కోట్లకు ఆదాయం  2 శాతం పెరిగిన వాహన విక్రయాలు న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో ​‍తైమాసిక కాలంలో 4 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,525 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,587 కోట్లకు పెరిగిందని మారుతీ సుజుకీ తెలియజేసింది. సేల్స్‌ ప్రమోషన్‌ వ్యయాలు అధికంగా ఉండటం, అధిక తరుగుదల,

ఫిబ్రవరిలో భారత్‌కు ట్రంప్‌!

Wednesday 29th January 2020

భారీ ట్రేడ్‌ డీల్‌ కుదిరే అవకాశం దాదాపు రూ.71వేల కోట్ల విలువైన మెగా ట్రేడ్‌ డీల్‌ భారత్‌, యూఎస్‌ మధ్య వచ్చే నెల కుదరనుంది. ఫిబ్రవరిలో యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్(యూఎస్‌టీఆర్‌) రాబర్ట్‌ లైట్జర్‌ భారత్‌కు రానున్నారు. భారత సందర్శనలో రాబర్ట్‌ ట్రేడ్‌డీల్‌ను ఖరారు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంతరం ఫిబ్రవరిలోనే భారత్‌కు వచ్చే ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పర్యటనలో డీల్‌పై సంతకాలు జరుగుతాయని తెలిపాయి. ఫిబ్రవరి రెండో వారంలో రాబర్ట్‌,

Most from this category