News


మహీంద్రాకు మందగమనం సెగ

Saturday 9th November 2019
news_main1573270814.png-29468

  • 78 శాతం తగ్గిన నికర లాభం 
  • 21 శాతం పడిపోయిన అమ్మకాలు 
  • స్వల్పంగా మెరుగుపడిన మార్జిన్లు 

ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసిక కాలంలో 78 శాతం తగ్గి రూ.368 కోట్లకు చేరింది. అమ్మకాలు బాగా పడిపోవడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. ఆదాయం 6 శాతం తగ్గి రూ.23,936 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మార్కెట్‌ అంచనాలకు అందని విధంగా ఉన్నందున అమ్మకాలు, ఆదాయ అంచనాలను వెల్లడించడం లేదని కం‍పెనీ ఎమ్‌డీ పవన్‌ గోయెంకా వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో మాత్రం అమ్మకాలు పుంజుకున్నాయని చెప్పారు. బీఎస్‌-6 వాహనాలను వచ్చే ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం..., 

స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం తక్కువగానే క్షీణించింది. నికర లాభం 28 శాతం తగ్గి రూ.1,355 కోట్లకు చేరింది. ఇక వాహన విభాగం విక్రయాలు 21 శాతం తగ్గాయి. గత క్యూ2లో 1,41,163గా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ2లో 1,10,824కు తగ్గాయి. ఇన్ని ప్రతికూలతలున్నా, మార్జిన్లు మాత్రం సీక్వెన్షియల్‌గా చూస్తే, 10 బేసిస్‌ పాయింట్లు మెరుగుపడి 14.1 శాతానికి పెరిగాయి. ఉత్పత్తి వ్యయాలు నిలకడగా ఉండటం, వ్యయ నియంత్రణ పద్ధతులు దీనికి కారణం. 



You may be interested

అశోక్‌ లేలాండ్‌ లాభం 93 శాతం డౌన్‌

Saturday 9th November 2019

గత క్యూ2లో రూ.528 కోట్ల నికర లాభం  ఈ క్యూ2లో రూ.39 కోట్లే  న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్‌ లేలాండ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 93 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.528 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.39 కోట్లకు తగ్గిందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. ఆదాయం రూ.7,621 కోట్ల నుంచి 48 శాతం తగ్గి రూ.3,939 కోట్లకు

గెయిల్‌ ఇండియా టర్నోవర్‌ రూ.18,010 కోట్లు

Saturday 9th November 2019

35 శాతం తగ్గిన నికర లాభం  తగ్గిన మార్జిన్లు, ధరల ప్రభావం  న్యూఢిల్లీ:- ప్రభుత్వ రంగ గెయిల్‌ ఇండియా కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 35 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.1,789 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,168 కోట్లకు తగ్గిందని గెయిల్‌ ఇండియా తెలిపింది. నేచురల్‌ గ్యాస్‌ మార్కెటింగ్‌ మార్జిన్లు తగ్గడం, పెట్రో కెమికల్‌ వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల నికర

Most from this category