News


ఎం అండ్‌ ఎం చేతికి ఫిప్త్‌గేర్‌ వెంచర్స్‌

Saturday 18th January 2020
news_main1579336686.png-31018

న్యూఢిల్లీ: మహీంద్ర అండ్‌ మహీంద్ర కంపెనీ(ఎం అండ్‌ ఎం)  ఈ-కామ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఫిప్త్‌ గేర్‌ వెంచర్స్‌(ఎఫ్‌జీవీఎల్‌)ను కొనుగోలు చేయనుంది. మహీంద్ర కంపెనీ తన అనుబంధ సంస్థ అయిన  మహీంద్ర ఫస్ట్‌ ఛాయిస్‌ వీల్స్‌ లిమిటెడ్‌(ఎంఎఫ్‌సీడబ్ల్యూఎల్‌) ఫిప్త్‌గేర్‌ వెంచర్స్‌ను రూ.30.45 కోట్లవరకు కొనుగోలు చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. డిజిటల్‌ ఆటోమోటివ్స్‌ను మరింత విస్తరించేందుకు ఎఫ్‌జీవీఎల్‌ను సొంతం చేసుకుంటున్నట్లుగా మహీంద్ర మహీంద్ర కంపెనీ  వెల్లడించింది.  ఇప్పటికే ఫిప్త్‌ గేర్‌ వెంచర్స్‌ను పూర్తిస్థాయిలో సొంతం చేసుకునేందుకు ఒప్పంద సంతకాలు దాదాపు పూర్తయ్యాయని, ఒకటి లేదా రెండు దశల్లో రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఫైలింగ్‌ చేస్తామని కంపెనీ పేర్కొంది. ఎఫ్‌జీవీఎల్‌ను పూర్తిస్థాయిలో 2020 మార్చి 31 నాటికి సొంతం చేసుకుంటామని కంపెనీ పేర్కొంది. అయితే విలీనం కాబోయే ఎఫ్‌జీవీఎల్‌... 2015లో www.carandbike.com" అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి కొత్త, పాత వాహనాల కొనుగోలు, విక్రయాలను నిర్వహిస్తూ  ఈ-కామర్స్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫాంగా పనిచేస్తోంది. అంతేగాక తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌ సమాచారంతో పాటుగా, ఆటోమోటివ్‌ సెక్టార్‌లో సమీక్షలను కూడా అందిస్తోంది. 



You may be interested

టీసీఎస్‌, ఆర్‌ఐఎల్‌ షేర్లు పెరుగుతాయా? తగ్గుతాయా?

Saturday 18th January 2020

దిగ్గజ కంపెనీల ఫలితాలపై ప్రభావం ఇలా... శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లలో గడిచిన వారం ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. దీంతో ఇకపై మార్కెట్‌ కొంతమేర కన్సాలిడేట్‌ కావచ్చు. లార్జ్‌క్యాప్స్‌లో ఈ ప్రభావం కనిపించే వీలుంది. అయితే మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో ప్రారంభమైన ర్యాలీ కొనసాగవచ్చని భావిస్తున్నామంటున్నారు శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా. ఒక ఇంటర్వ్యూలో మెహతా వెల్లడించిన

నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ ఉపయోగాలివే..!

Saturday 18th January 2020

దూరంగా ఉన్న మన స్నేహితులకో, బంధువులకో ఏదైనా విషయాన్ని చెప్పాలంటే మొదట్లో తంతి తపాల మీద ఆధారపడేవారము.మన రాసిన ఉత్తరం చేరడానికి కొన్ని సార్లు నెలలు కూడా పట్టేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతరోజుల్లో టెక్నాలజీ వాడకం బాగా పెరగడంతో సమాచారం ఒకచోట నుంచి మరో చోటికి సెకన్ల వ్యవధిలోనే చేరిపోతుంది. దీంతో ఇప్పుడు పోస్టు ఆఫీసులకు ఆదరణ తగ్గిందనే చెప్పాలి. కానీ భారత పోస్టల్‌ వ్యవస్థ వివిధ

Most from this category