News


బొలెరో విక్రయాల్లో 12 శాతం వృద్ధి

Wednesday 19th June 2019
news_main1560926348.png-26407

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ ఆర్ధిక సంవత్సరంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వాణిజ్య వాహనమైన బొలెరో అమ్మకాల్లో 12 శాతం వృద్ధిని లక్ష్యించింది. గత ఆర్ధిక సంవత్సరంలో 1.62 లక్షల వాహనాలను, 2018 ఆర్ధికంలో 1.49 లక్షలను విక్రయించామని.. ఏడాదిలో 9 శాతం వృద్ధిని నమోదు చేశామని ఎం అండ్‌ ఎం వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌– ఆటోమోటివ్‌ డివిజన్‌) విక్రమ్‌ గార్గా తెలిపారు. మంగళవారం కొత్త బొలెరో క్యాంపర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య వాహన శ్రేణిలో బొలెరో ఫ్లాగ్‌షిప్‌ బ్రాండ్ అని, 86 శాతం మార్కెట్‌ వాటా దీని సొంతమని ఆయన తెలిపారు. 
3 రకాలు; ధర రూ.7.28 లక్షలు
క్యాంపర్‌ నాన్‌ ఏసీ, క్యాంపర్‌ 4డబ్ల్యూడీ, క్యాంపర్‌ గోల్డ్‌ వీఎక్స్‌ మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.7.28 లక్షలు. టన్ను పేలోడ్‌ కెపాసిటీ సామర్థ్యమున్న క్యాంపర్‌లో పవర్‌ విండోస్, సెంట్రల్‌ లాకింగ్, స్టయిల్‌ గ్రిల్లీ, రిఫ్లెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌ వంటి సరికొత్త ఫీచర్లను పొందుపరిచామకి కంపెనీ తెలిపింది. మూడేళ్లు లేదా లక్ష కి.మీ. వరకూ వారంటీ ఇస్తుంది. 



You may be interested

ఈ-కామర్స్ విధానంపై కసరత్తు

Wednesday 19th June 2019

  పరిశ్రమ వర్గాల అభిప్రాయాలకు 10 రోజులు న్యూఢిల్లీ: జాతీయ ఈ-కామర్స్ విధానం రూపకల్పనపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రూపొందించిన ముసాయిదాపై పది రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా పరిశ్రమ వర్గాలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్ సూచించారు. ఇప్పటికే ఈ- కామర్స్‌, టెక్నాలజీ పరిశ్రమ వర్గాలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు డేటా భద్రత సహా మరికొన్ని అంశాలపై తమ అభ్యంతరాలను

మెగా బీమా సంస్థ

Wednesday 19th June 2019

మూడు జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల విలీన ప్రతిపాదన అటుపై న్యూ ఇండియా అష్యూరెన్స్‌తో కలయిక ఎల్‌ఐసీ తరహా దిగ్గజం ఏర్పాటుపై కేంద్రం కసరత్తు ఇక ప్రభుత్వ రంగంలో ఒకే సాధారణ బీమా సంస్థ న్యూఢిల్లీ: జీవిత బీమాకు సంబంధించి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తరహాలో... ప్రభుత్వ రంగంలోని సాధారణ బీమా సంస్థలన్నింటినీ కలిపి ఒకే దిగ్గజ సంస్థగా ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. న్యూ ఇండియా అష్యూరెన్స్‌ గొడుగు కిందికి మిగతా మూడింటినీ తెచ్చే

Most from this category