News


ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ లాభం రూ.206 కోట్లు

Saturday 19th October 2019
news_main1571459443.png-28998

  • 8 శాతం వృద్ధి 
  • 11 శాతం పెరిగి రూ.1,402 కోట్లకు ఆదాయం

న్యూఢిల్లీ: లార్సెన్‌ అండ్‌ టుబ్రో టెక్నాలజీ సర్వీసెస్‌ (ఎల్‌టీటీఎస్‌) కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.206 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో ఆర్జించిన నికర లాభం రూ.191 కోట్లుతో పోల్చితే 8 శాతం వృద్ధి సాధించామని ఎల్‌టీటీఎస్‌ తెలిపింది. ఆదాయం రూ.1,266 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.1,402 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ కేశభ్‌ పాండా తెలిపారు. డాలర్ల పరంగా ఆదాయం 12 శాతం వృద్ధితో 20 కోట్ల డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ క్యూ2లో 8 భారీ డీల్స్‌ను సాధించామని చెప్పారు.  ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఉద్యోగుల సంఖ్య 16,789గా ఉందని, ఆట్రీషన్‌ రేటు(ఉద్యోగుల వలస) 13.4 శాతంగా ఉందని తెలిపారు. 



You may be interested

ఐసీఐసీఐ లాంబార్డ్‌కు రూ.308 కోట్ల లాభం

Saturday 19th October 2019

న్యూఢిల్లీ:  ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.308 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.2,739 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.2,571 కోట్లు, నికర లాభం రూ.293 కోట్లతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. ఒక్కో షేరుకు రూ.3.50 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఇక ప్రస్తుత ఆర్థిక

బ్యాంకుల్లో మన డబ్బు మరింత భద్రం!

Saturday 19th October 2019

డిపాజిట్లపై బీమా రూ.3 లక్షలకు పెంచే ప్రతిపాదన  పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టిన డీఐసీజీసీ త్వరలో ఆర్థిక శాఖకు నివేదిక ఆచరణ దాలిస్తే డిపాజిట్‌దారులకు మరింత రక్షణ ప్రస్తుతం రూ.లక్ష వరకే బీమా న్యూఢిల్లీ: బ్యాంకుల్లో డిపాజిట్లకు మరింత రక్షణ కల్పించే రోజులు కనుచూపుమేరలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఒక వ్యక్తి ఒక బ్యాంకు పరిధిలో ఎంత మేర డిపాజిట్‌ చేసినా కానీ, ఆ బ్యాంకు సంక్షోభం భారిన పడితే గరిష్టంగా రూ.లక్ష వరకే పొందే అవకాశం ఉంది. డిపాజిట్‌

Most from this category