News


వివాద్‌ సే విశ్వాస్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Thursday 5th March 2020
news_main1583382642.png-32293

న్యూఢిల్లీ: వివాద్‌ సే విశ్వాస్‌ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. 2020-21 బడ్జెట్‌లో ఈ ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, ఆదాయపన్ను శాఖ జారీ చేసిన డిమాండ్‌ నోటీసులను వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు వెళ్లిన వారు.. 2020 మార్చి 31 నాటికి బకాయిలను చెల్లిస్తే చాలు. దానిపై వడ్డీ, పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్‌ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్‌ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి కమిషనర్‌, అప్పీల్స్‌, ఆదాయపన్ను శాఖ.. ఆదాయపన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌.. హైకోర్టు.. సుప్రీంకోర్టు వంటి పలు అప్పిలేట్‌ వేదికల వద్ద 4,83,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.9 లక్షల కోట్లు రావాల్సి ఉంది. వీటిలో అధిక భాగాన్ని ఈ ఏడాది మార్చి చివరికి పరిష్కరించి, పన్నుల ఆదాయం పెంచుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కూడా ఈ లక్ష్యంలో భాగమే. ఈ పథకంలో కింద... వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించినట్లయితే వారికి ఎలాంటి జరిమానాలూ ఉండవు. పైపెచ్చు క్షమాభిక్ష కల్పిస్తారు. తద్వారా భవిష్యత్తులో ఆ వివాదానికి సంబంధించి చట్టపరమైన విచారణలు లేకుండా రక్షణ పొందొచ్చు. You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 5th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు మ్యాక్స్‌ ఫైనాన్సియల్స్‌: మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలోఉన్న 21.87 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు టోక్యోకు చెందిన మిట్సు సుమిటోమో ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ  ఆదిత్య పూరి తర్వాత బ్యాంక్‌ను విజయ పథంలో నడిపించే ‍కొత్త సీఈఓ కోసం హెచ్‌డీఎఫ్‌సీ ప్యానెల్‌ అన్వేషణ ప్రారంభించింది. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను నిర్మించేందుకు

ఏపీలో ‘సాలోమ్‌’ ఉత్పత్తుల తయారీ

Thursday 5th March 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పవర్‌ సొల్యూషన్స్‌ రంగంలో ఉన్న తైవాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ సాలోమ్‌ ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో తయారు కానున్నాయి. ఈ మేరకు అమర రాజా ఎలక్ట్రానిక్స్‌తో కంపెనీ బుధవారమిక్కడ చేతులు కలిపింది. అమర రాజాకు చెందిన చిత్తూరు ప్లాంటులో ఎక్స్‌టర్నల్‌ పవర్‌ సప్లైస్‌, బ్యాటరీ చార్జర్స్‌, వాల్‌ ప్లగ్‌ ఇన్‌ పవర్‌ సప్లైస్‌, కార్‌ చార్జర్స్‌, వెహికిల్‌ పవర్‌ అడాప్టర్స్‌, పవర్‌ బ్యాంక్స్‌,

Most from this category